BSNL 90 Days Plan:బిఎస్ఎన్ఎల్ 90 రోజుల ప్లాన్ కేవలం రెండు రూపాయలతో బంపర్ బెనిఫిట్స్ కూడా పొందుతారు. ప్రభుత్వ రంగ బిఎస్ఎన్ఎల్ కంపెనీ కొత్త ప్లాన్స్ తో కస్టమర్లను ఆకట్టుకున్న సంగతి తెలిసింది. అయితే ఈరోజు 90 రోజుల ప్లాన్ వివరాలను తెలుసుకుందాం. ఈ ప్లాన్ బడ్జెట్ కేవలం రోజుకు రూ.2 దీంతో మీ సిమ్ ఎప్పటికీ యాక్టీవ్‌గా ఉంటుంది. ఇది కాకుండా ఇతర బెనిఫిట్స్ కూడా పొందుతారు.
బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ 90 రోజుల వాలిడిటీ ప్లాన్ కేవలం రూ. 201 రూపాయితో అందుబాటులో ఉంది. అంటే మీకు ప్రతిరోజు కేవలం రెండు రూపాయలు పడుతుంది. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్ ఎక్కువ మందిని ఆకట్టుకుంటుంది. ఎందుకంటే వాలిడిటీ కూడా మూడు నెలలు వస్తుంది.
అదనంగా ఈ రీఛార్జ్ ప్లాన్ లో 300 నిమిషాల కాల్స్ ఉచితంగా పొందుతారు. ఇందులో 6 జిబి డేటా కూడా అందుకుంటారు. 99 ఎస్ఎంఎస్లు ఉచితంగా పొందుతారు. ఇది జిపి2 కస్టమర్ల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ప్లాన్. సెకండ్ సిమ్ యాక్టీవ్‌గా ఉండాలనుకుంటే కూడా బెస్ట్ ప్లాన్.
ఇక రెగ్యులర్‌గా రీఛార్జ్ చేసుకునే కస్టమర్ల కోసం 90 రోజుల బీఎస్ఎన్ఎల్ వ్యాలిడిటీ ప్లాన్ కూడా అందుబాటులో ఉంది. ఇది రూ.411 ఇందులో అపరిమిత వాయిస్ కాలింగ్ ఏ నెట్వర్క్ అయినా చేసుకోవచ్చు. అంతేకాదు ఫ్రీగా నేషనల్ రోమింగ్ అదనంగా 2 జిబి డేటా ప్రతిరోజు పొందుతారు. ప్రతిరోజు 100 ఫ్రీ ఎస్ఎంఎస్ లు కూడా పొందుతారు
దిగ్గజ ప్రైవేట్ టెలికాం కంపెనీ జియో రూ.49 రీఛార్జ్ ప్లాన్లు పరిచయం చేసింది. ఇది అపరిమిత డేటా వాడే కస్టమర్లకు ఇది బెస్ట్. డైలీ డేటా లిమిట్ అయిపోయిన వారు సులభంగా ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవచ్చు. దీంతో రోజంతా అపరిమిత డేటా పొందవచ్చు. ఓటీటీలు వీక్షించడానికి కూడా ఇది మంచి ఎంపిక.
ఇక రూ. 49 రీఛార్జ్ ప్యాక్ అంటే ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ. రోజంతా అపరిమిత డేటా పొందవచ్చు. ఎఫ్‌యూపీ పాలసీ ప్రకారం 25 జీబీ డేటా వరకు పొందుతారు. 24 గంటల వరకు వ్యాలిడిటీ ఉంటుంది.. 25 జిబి డేటా అయిపోయిన తర్వాత 40 కేపిపిఎస్ డేటా లిమిట్ అందుకుంటారు
ఇక ఈ కొత్త జియో రీఛార్జ్ ప్లాన్ తో ఎయిర్టెల్ విఐ, బిఎస్ఎన్ఎల్ కంపెనీలకు పెద్ద షాక్ అని చెప్పవచ్చు. అతి తక్కువ ధరలోని రోజు అంతటికి కావలసిన అన్లిమిటెడ్ ప్లాన్ అందించడంలో జియో ముందు వరసలో ఉంది. ఈ ప్లాన్ తో ఎంటర్టైన్మెంట్ నిరంతరంగా వీక్షించవచ్చు