Happy Bhogi Wishes Images And Quotes 2025: సంక్రాంతి ముందు రోజు జరుపుకునే పండగనే భారతీయులు భోగి పండుగగా పిలుస్తారు. ఈ పండగ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఘనంగా జరుగుతుంది. ముఖ్యంగా భోగి పండుగ రోజున రైతులంతా ఎంతో ఆనందంగా ఉంటారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ భోగి మంటలు వేసి ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన పండుగ రోజున మీరు కూడా మీ కుటుంబ సభ్యులకు, మీ స్నేహితులకు, శ్రేయోభిలాషులకు ఇలా భోగి శుభాకాంక్షలు పంపండి.
భోగిమంటల్లో గత సంవత్సరం బాధలు, కష్టాలు కాలిపోయి.. మీ మనసులో కొత్త సంవత్సరం ఆనందాలను మొలకెత్తించాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు.
భోగిమంటల్లో మీకున్న కష్టాలు కాలిపోయి.. కొత్త ఆశలు, విజయాలు ముందు ముందు రావాలని కోరుకుంటూ.. పేరుపేరునా ప్రతి ఒక్కరికి భోగి పండుగ శుభాకాంక్షలు.
భోగి మంటల వెలుగులు మన జీవితంలో చీకటిని తొలగించి ప్రకాశవంతమైన జీవితాన్ని ప్రసాదించాలని.. కొత్త సంవత్సరంలో కొత్త ఆరంభాలను తీసుకురావాలని కోరుకుంటూ.. ప్రతి ఒక్కరికి భోగి పండగ శుభాకాంక్షలు.
ఈ భోగి పండుగ మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ సంతోషాలతో పాటు ఆనందాలను అందించాలని కోరుకుంటూ.. మీ అందరికీ భోగి పండుగ ప్రత్యేకమైన శుభాకాంక్షలు.
భోగి పండగ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ, మీకు మేలుకోరే వారికి ఆరోగ్యం, సంపద, సంతోషాలను కలిగించాలని కోరుకుంటూ.. భోగి పండుగ శుభాకాంక్షలు.
ఈ భోగి పండుగ సందర్భంగా మీ ఇల్లు ఆనందంతో కళకళలాడాలని.. కుటుంబ సభ్యులంతా ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు భోగి పండుగ శుభాకాంక్షలు.
భోగి పండగ రోజున మీరు అనుభవిస్తున్న కష్టాలన్నీ మంటల రూపంలోనే కాలిపోవాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు ప్రత్యేకమైన భోగి పండుగ శుభాకాంక్షలు.
ఈ భోగి పండగ ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా మీ జీవితంలో ఆనందం సుఖసంతోషాలను నింపాలని కోరుకుంటూ.. మీ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు..