వినియోగదారులను ఆకర్శించడానికి బిఎస్ఎన్ఎల్ తన సిమ్ కార్డులను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. దీని కోసం కొన్ని నియమాలు ఉన్నాయి. వాటిని పాటిస్తే మీకు ఉచితంగా సిమ్ కార్డు లభిస్తుంది.
ప్రభుత్వ సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ( BSNL ) ఈ మధ్య కాలంలో వినియోగదారులను ఆకర్శిచడానికి వివిధ రకాలుగా ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా కస్టమర్లకు ఉచిత సిమ్ కార్డు ఇవ్వడానికి కొత్త స్కీమ్ తీసుకొచ్చింది. తన ప్రమోషన్ ఆఫర్ లో భాగంగా ఉచిత సిమ్ కార్డును అందించనుంది.
Also Read | ZH Fact Check: డిసెంబర్ 1న దేశంలో మరోసారి లాక్‌డౌన్ పెట్టనున్నారా? నిజం తెలుసుకోండి!
టెలికామ్ సంస్థ అయిన BSNLసిమ్ కార్డు కోసం రూ.20 చార్జీలు చేస్తోంది. ప్రమోషన్ ఆఫర్ లో భాగంగా సిమ్ కార్డును 28 నవంబర్ నుంచి ఉచితంగా ఇవ్వనున్నారు.
ఉచిత సిమ్ కార్డు సొంతం చేసుకున్న తరువాత వినియోగదారులు ముందుగా దగ్గరిలోని BSNL స్టోర్ కు వెళ్లి మినిమం 100 రూపాయల రీచార్జ్ చేయాల్సి ఉంటుంది.
BSNL తన వినియోగదారులను ఇంప్రెస్ చేయడానికి కార్డు ఆఫర్ ప్రారంభించింది. వినియోగదారులను ఆకర్శించడానికి కొన్ని షరతులను కూడా విధించింది. లిమిటెడ్ ఆఫర్ లో భాగంగా నవంబర్ 14 నుంచి 28 వరకు ఈ సిమ్ కార్దులను సొంతం చేసుకోవచ్చు.