Union Budget 2025: ఈసారి బడ్జెట్లో రైతులకు శుభవార్త అందనుందా? ఆర్థిక మంత్రి సంచలన ప్రకటన చేసే ఛాన్స్ ?

Union Budget 2025: దేశంలోని రైతుల కోసం మోదీ సర్కార్ రకరకాల సదుపాయాలను కల్పిస్తోంది. రైతు ఆర్థికంగా ఎదిగేందుకు చర్యలు తీసుకుంటూనే ఉంది. వ్యవసాయాన్ని మరింత బలోపేతం చేసేందుకు రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఈ సారి బడ్జెట్లో కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  
 

1 /6

Union Budget 2025: కేంద్రంలోని మోదీ సర్కార్.. కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి 1, 2025న పార్లమెంట్ లో సమర్పించనుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ఉదయం 11 గంటలకు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మోదీ ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని పెంచే పనిలో పడింది. 

2 /6

గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా రైతులకు పెద్దపీట వేయవచ్చని భావిస్తున్నారు. రైతుల ఆదాయాన్ని పెంచడంపైనే ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ బడ్జెట్‌లో రైతులకు ఎలాంటి భారీ ప్రకటనలు చేస్తారో తెలుసుకుందాం.  

3 /6

కిసాన్ క్రెడిట్ కార్డ్: కిసాన్ క్రెడిట్ కార్డ్ (కెసిసి) పరిమితిని పెంచుతున్నట్లు ప్రకటించడం ద్వారా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్‌లో రైతులకు పెద్ద బహుమతి ఇవ్వవచ్చు అనే వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న KCC పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. దీంతో రైతులు ఎంతో ప్రయోజనం పొందుతారు. KCC పరిమితిని పెంచడం ద్వారా, రైతులు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి ఎక్కువ పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది.   

4 /6

వ్యవసాయ ఇన్‌పుట్‌లపై జిఎస్‌టి 2025-26 ఆర్థిక సంవత్సరానికి, ప్రభుత్వం వ్యవసాయ ఇన్‌పుట్‌లపై విధించే GSTని తగ్గించవచ్చు. వివిధ పంటల సాగులో ఉపయోగించే విత్తనాలు, ఎరువులపై వేర్వేరుగా జీఎస్టీ విధిస్తున్నారు. రైతుల ఆదాయాన్ని పెంచే ప్రయత్నాల్లో భాగంగా ప్రభుత్వం వారిపై విధించే జీఎస్టీని తగ్గించవచ్చు.  

5 /6

వ్యవసాయ పథకాలు గత బడ్జెట్‌లో వ్యవసాయ సంబంధిత పథకాలకు ప్రభుత్వం రూ.65,529 కోట్లు కేటాయించింది. అయితే, ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం వ్యవసాయ పథకాలకు 5 నుండి 7 శాతం కేటాయింపులను పెంచవచ్చు.  

6 /6

నిర్మలా సీతారామన్ తన 8వ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు నిర్మలా సీతారామన్‌కి ఇది 8వ బడ్జెట్‌. ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అయిన తర్వాత ఇది రెండో బడ్జెట్‌. 2024 జూన్‌లో తన మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత, ప్రధాని మోదీ మూడవసారి మొదటి పూర్తి బడ్జెట్‌ను గత ఏడాది జూలైలో సమర్పించారు.