PF Pensions: EPFO పెన్షన్‌దారులకు బిగ్ గిఫ్ట్.. కొత్త పెన్షన్‌ స్కీమ్‌తో ఆ కష్టాలకు చెక్

EPFO Latest Updates: కొత్త ఏడాది ప్రారంభమైంది. కొత్త రూల్స్ కూడా అమల్లోకి వచ్చాయి. ముఖ్యంగా ఈపీఎఫ్‌ఓకు సంబంధించి నిబంధనల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. కేంద్రీకృత పెన్షన్ విధానంతో పెన్షనర్లు తమ పెన్షన్‌ను దేశంలోని ఏ బ్యాంక్ బ్రాంచ్ నుంచి అయినా తీసుకునే వెసులుబాటు కల్పించింది. ఈ విధానం జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది.
 
1 /7

ఈపీఎఫ్‌ఓ పెన్షన్‌దారులకు కేంద్రం గుడ్‌న్యూస్ అందించింది. సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ (CPPS) ద్వారా దేశంలో ఎక్కడైనా పెన్షన్ అందుకునే అవకాశం కల్పించింది.  

2 /7

ఇక నుంచి పింఛనుదారులు పెన్షన్ చెల్లింపు ఆర్డర్‌ను ఒక కార్యాలయం నుంచి మరో కార్యాలయానికి లేదా బ్యాంక్‌కు బదిలీ చేయాల్సిన అవసరం లేదు. రిటైర్మెంట్ తరువాత సొంతూళ్లకు వెళ్లే పెన్షన్‌దారులకు ఇది ఎంతో ఉపశమనం కలిగించనుంది.  

3 /7

CPPS కు గతేడాది సెప్టెంబర్‌లో ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. జనవరి 1, 2025 నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో 1995 ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (EPS) కింద వచ్చే పెన్షనర్లకు లబ్ధి చేకూరింది.  

4 /7

కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా మాట్లాడుతూ.. CPPS ట్రయల్ రన్ కింద జమ్మూ, శ్రీనగర్, కర్నాల్ ప్రాంతాలకు చెందిన 49 వేల మందికిపైగా ఈపీఎస్ పెన్షనర్లకు అక్టోబర్‌లో దాదాపు రూ.11 కోట్ల పెన్షన్ అందించినట్లు వెల్లడించారు. ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని తెలిపారు.  

5 /7

ఈ సమస్యలన్నింటి నుంచి ఉపశమనం కలిగించేందుకు కేంద్రం సీపీపీఎస్‌ను తీసుకువచ్చింది. మోదీ సర్కార్ నిర్ణయంతో కొత్త సంవత్సరంలో పింఛన్‌దారులకు ఉపశమనం కలిగింది.  

6 /7

ఈ సమస్యలన్నింటి నుంచి ఉపశమనం కలిగించేందుకు కేంద్రం సీపీపీఎస్‌ను తీసుకువచ్చింది. మోదీ సర్కార్ నిర్ణయంతో కొత్త సంవత్సరంలో పింఛన్‌దారులకు ఉపశమనం కలిగింది.  

7 /7

ఈ సమస్యలన్నింటి నుంచి ఉపశమనం కలిగించేందుకు కేంద్రం సీపీపీఎస్‌ను తీసుకువచ్చింది. మోదీ సర్కార్ నిర్ణయంతో కొత్త సంవత్సరంలో పింఛన్‌దారులకు ఉపశమనం కలిగింది.