Central Government New Scheme: ఎలాంటి పెట్టుబడి లేకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపు రూ.3 లక్షల వరకు ఆర్థిక సహాయం పొందవచ్చు. ఈ రుణ సౌకర్యం దాదాపు 18 వివిధ కాళాకారులకు లభించనుంది.
Central Government New Scheme: భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని ప్రపంచంలో నెంబర్ వన్‌గా ఉంచేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే కొత్త కొత్త పథకాలను అందుబాటులోకి తీసుకు వస్తోంది. అభివృద్ధిపథంలో రోజురోజుకు భారత్ దుసుకుపోతోంది. అంతేకాకుండా చేతివృత్తుల వారిని కూడా అభివృద్ధిపథంలో నడిపించేందుకు ప్రత్యేకమైన పథకాన్ని అందిస్తున్నాయి.
చేతివృత్తుల వారికి ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే కొన్ని ప్రత్యేకమైన పథకాలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇందులో భాగంగానే విశ్వకర్మ యోజన పథకాన్ని కేంద్రం తీసుకు వచ్చింది.
హస్తకళకారుల నైపుణ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేసేందుకు ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని కేంద్ర పరిచయం చేసింది. దీని ద్వారా హస్తకళాకారులకు ఊహించని లబ్ధి చేకూరుతుంది.
గత సంవత్సరం 17 సెప్టెంబర్ మోదీ తన పుట్టిన రోజు సందర్భంగా ఈ విశ్వకర్మ యోగన పథకాన్ని ప్రారంభించారు. ఇప్పటికీ ఈ పథకం ద్వారా దాదాపు 23 లక్షలకుపైగా మంది కాళాకారులు లబ్ధి పొందినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అతి తక్కువ వడ్డీ రేటుతో విశ్వకర్మ రుణం లభించబోతోంది.
ఇప్పటికీ 18 విభిన్న రంగాలకు సంబంధించిన భారత కాళాకారులు లబ్ధి పొందిన్నట్లు తెలుస్తోంది. ఈ పథకం కింద ప్రతి అర్హుడికి దాదాపు రూ.3 లక్షలకు పైగా రుణం లభించనుంది. ఇప్పటికే దాదాపు 11 లక్షలకు పైగా కళాకారులు లబ్ధిపొందిన్నట్లు సమాచారం.
ఈ పథకంలో భాగంగా కమ్మరితో పాటు గోల్డ్ స్మిత్, శిల్పి, వడ్రంగి ఇలా 18 విభిన్న కళాకారులకు ఇది వర్థిస్తుంది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు రూ. 551.8 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు తెలుస్తోంది.