Google Services: గూగుల్ ఎక్కౌంట్ బ్లాక్ కాకూడదంటే ఫోన్ మార్చుకోండి

రేపట్నించి లక్షలాది ఫోన్లలో జీ మెయిల్, యూట్యూబ్, గూగుల్ మ్యాప్ వంటివేవీ పనిచేయవు. నమ్మలేకపోతున్నారా..నిజమే. ఫోన్లు అప్‌గ్రేడ్ కాకపోతే రేపట్నించి ఇదే పరిస్థితి. వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.సెప్టెంబర్ 27వ తేదీ అంటే రేపట్నించి లక్షలాది ఫోన్లలో ఆ సేవల్ని నిలిపివేసేందుకు గూగుల్ నిర్ణయించింది. పాత స్మార్ట్‌ఫోన్లలో గూగుల్ సంబంధిత అకౌంట్లు శాశ్వతంగా పనిచేయవిక.

Google Services: రేపట్నించి లక్షలాది ఫోన్లలో జీ మెయిల్, యూట్యూబ్, గూగుల్ మ్యాప్ వంటివేవీ పనిచేయవు. నమ్మలేకపోతున్నారా..నిజమే. ఫోన్లు అప్‌గ్రేడ్ కాకపోతే రేపట్నించి ఇదే పరిస్థితి. వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.సెప్టెంబర్ 27వ తేదీ అంటే రేపట్నించి లక్షలాది ఫోన్లలో ఆ సేవల్ని నిలిపివేసేందుకు గూగుల్ నిర్ణయించింది. పాత స్మార్ట్‌ఫోన్లలో గూగుల్ సంబంధిత అకౌంట్లు శాశ్వతంగా పనిచేయవిక.
 

1 /4

ఆండ్రాయిడ్ 2.3 వెర్షన్‌తో ఇప్పటికీ నడుస్తున్న కొన్ని ఫోన్ల జాబితా ఇలా ఉంది. Sony Xperia Advance, Lenovo k800, Sony Xperia Go, Vodafone Smart, Samsung Galaxy S2, Sony Xperia P, LG Spectrum, Sony Xperia S, LG Prada 3.0, HTC Velocity, HTC Evo 4G, Motorola Fire, Motorola XT532. ఇవి కొన్ని మాత్రమే. ఇంకా చాలా ఉన్నాయి ఈ పాత వెర్షన్‌తో మార్కెట్‌లో. 

2 /4

అందుకే పాత స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తున్నవారంతా తక్షణం సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ చేసుకోవల్సిందే లేదా ఫోన్ మార్చుకోవాలి. ప్రస్తుతం ఆండ్రాయిడ్‌లో 11 వెర్షన్, ఐఫోన్లలో ఐవోఎస్ 15 నడుస్తోంది. 2010 నుంచి గూగుల్ ఒక్కొక్క వెర్షన్‌ను విడుదల చేస్తోంది. 2017 లో ఆండ్రాయిడ్ 2.3 ఫోన్లకు గూగుల్ పే సేవలు నిలిచిపోయాయి. 

3 /4

సెప్టెంబర్ 27 నుంచి 2.3 వెర్షన్ డివైజ్‌లలో గూగుల్ యాప్స్‌లో లాగిన్ కాలేరు. యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ఎర్రర్ చూపిస్తుంది. ఆండ్రాయిడ్ 2.3 వెర్షన్ లేదా అంతకంటే తక్కువ వెర్షన్ ఫోన్లలో ఈ సేవలు నిలిచిపోనున్నాయి. యూజర్ల భద్రత, డేటా పరిరక్షణ అంశాల్ని దృష్టిలో ఉంచుకుని గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది.

4 /4

మీ గూగుల్ అక్కౌంట్లు బ్లాక్ కాకుండా ఉండాలంటే ఫోన్లను అప్‌గ్రేడ్ చేయడం లేదా కొత్త మొబైల్‌కు మారిపోయి లాగిన్ కావడం చేయాల్సిందే. లేకపోతే జీ మెయిల్, గూగుల్ సెర్చ్, గూగుల్ డ్రైవ్, యూట్యూబ్ వంటి సేవలన్నీ నిలిచిపోనున్నాయి..