Chiranjeevi Shocking Comments : బ్రహ్మ ఆనందం సినిమా ఈవెంట్లో చిరంజీవి మాట్లాడుతూ.. ఇంట్లో ఉంటే మనవరాళ్లతో హాస్టల్ లా ఉంది అంటూ కామెంట్ చేశారు. అక్కడితో ఆగకుండా మరిన్ని కొన్ని మాటలు కూడా చెప్పారు మెగాస్టార్. ప్రస్తుతం చిరంజీవి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. విమర్శలు అందుకుంటున్నాయి..
ఈ మధ్యకాలంలో మెగాస్టార్ చిరంజీవి.. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లకు గెస్ట్ గా వస్తూ పలు రకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ మాటలు కొన్నిసార్లు చిరంజీవికి ఇబ్బందులు కలిగించేలా కనిపిస్తూ ఉన్నాయి. ఇటీవలే విశ్వక్ సేన్ లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో.. పొలిటికల్ పరంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ నిన్నటి రోజున బ్రహ్మానందం తన కుమారుడు నటించిన బ్రహ్మఆనందం అనే సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చి రాజకీయాలకు దూరమని తెలిపారు.
ఇలాంటి సందర్భంలోనే చిరంజీవి మనవరాలు అయిన రాంచరణ్ కూతురు క్లింకార తాత గారికి సంబంధించి ఫోటోను చూద్దాము అంటూ చెప్పగా.. ఫోటో ప్రజెంట్ అయిన తర్వాత సుమ ఇలా మాట్లాడుతూ.. పూర్తిగా క్లింకార ఫోటోను చూడలేదు కానీ.. మనవరాళ్లతో సేమ్ యాజిటీస్ గా ఉన్నదంటూ తెలియజేసింది సుమ.
దీంతో చిరంజీవి చేతిలో మైకు ఉండడంతో ఆయన ఇలా మాట్లాడుతూ.." నేను ఇంట్లో ఉన్నప్పుడల్లా నా గ్రాండ్ డాటర్స్ తో ఉన్నట్టు ఉండదు.. ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్ లా ఉంటున్నానంటూ ఫన్నీగా తెలియజేశారు... చుట్టూ ఆడపిల్లలే ఉన్నారు. ఒక్క మగపిల్లాడు కూడా లేరు.. ఈ విషయంపై రేయ్ చరణ్ ఈసారి ఎలాగైనా సరే ఒక అబ్బాయిని కనరా.. మన లెగసీ కంటిన్యూ అవ్వాలి అనే కోరిక అంటూ.. తెలిపారు. అయితే కూతురు అంటే తన కొడుక్కి చాలా ఇష్టమని తెలిపారు.. ఈ ఇష్టంతోనే మళ్లీ అమ్మాయిని కంటారేమో అనే భయం అంటూ తెలిపారు చిరంజీవి.అందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారుతున్నది.
అయితే ఈ విషయాన్ని కొంతమంది నెటిజన్స్ ఇలా వైరల్ చేస్తూ.. బాలయ్య ఒక వేళ ఇలానే మాట్లాడి ఉంటే చాలామంది మెగా అభిమానులు కుక్కల్లా మొరిగేవాళ్లు అంటూ కామెంట్ చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ కాబట్టి అందరూ సైలెంట్ గా ఉన్నారు.. అనే విధంగా కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు చిరంజీవి చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.