Delhi air emergency: దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యం కోరల్లో చిక్కుకుందని చెప్పుకొవచ్చు. ఈ క్రమంలో ప్రస్తుతం అక్కడి ప్రజలు బైటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. మాస్క్ లేనిది బైటకు రావడంలేదు.
దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం అతలాకుతలం చేస్తుందని చెప్పుకొవచ్చు. ముఖ్యంగా.. కొన్ని నెలలుగా ఎయిర్ క్వాలీటీ ఇండెక్స్ గణనీయంగా తగ్గిపోయింది. ఈ క్రమంలో.. ఢిల్లీలో గాలినీ పీల్చేందుకు జనాలు నరక యాతన అనుభవిస్తున్నారు
ఇప్పటికే పలు చోట్ల ఎయిర్ క్వాలీటి ఇండెక్స్ 500 మార్క్ ను చేరుకుంటుందంట. దీంతో సుప్రీంకోర్టు సైతం ఢిల్లీ సర్కారుపై సీరియస్ అయ్యింది.కొన్ని రోజుల పాటు ఈ కాలుష్యంను కంట్రోల్ చేసే నియమాలు పాటించాలని చెప్పిందంట. మరోవైపు ప్రస్తుతం కాలుష్యంను తగ్గించడానికి కృత్రిమ వర్షం ఉపయోగ పడుతుందని ఆప్ మంత్రి వ్యాఖ్యలు చేశారు.
కృత్రిమ వర్షంను క్లౌడ్ సీడింగ్ అంటారు. దీనిలో మేఘాల్లో రసాయనాలు చల్లుతారు. దీని వల్ల కుండపోతగా వర్షం కురుస్తుంది. దీని వల్ల గాలిలోని దుమ్ము దూళి కణాలు కిందకు పడిపోతాయి. మెయిన్ గా సిల్వర్ అయోడైడ్, పొటాషియం అయోడైట్ వంటి కెమికల్స్ ను కల్పుతారు.
దీనికోసం మెయిన్ గా.. డైరెక్టరెట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్ అఫైర్స్ తోప పాటు స్పెషల్ ప్రొటెకన్ గ్రూప్ నుంచి అనుమతులు తీసుకొవాల్సి ఉంటుంది. దీని వల్ల కొంత మేరకు వాయుకాలుష్యం తగ్గుతుందని వార్తలు వస్తున్నాయి.
మెయిన్ గా సైంటిస్టులు.. ల్యాబ్ లలో ఆర్టిఫిషియల్ మేఘాలను క్రియేట్ చేస్తారు. దీని మీద పైన చెప్పిన రసాయనాల్ని స్ప్రె చేయగానే వర్షం పడుతుంది. దీని వల్ల గాలిలోకి తేమ, దుమ్ము, ధూళి కణాలు కిందకు పడిపోతాయి. దీని వల్ల కొంత మేరకు గాలి కాలుష్యం అదుపులోకి ఉంటుందని కూడా తెలుస్తొంది.