Diwali Bumper Gift: సామన్య వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. త్వరలోనే పెట్రోల్‌తో పాటు డిజిల్ ధరలను తగ్గించుబోతున్నట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లో పెట్రోల్ ధర ఏకంగా దాదాపు రూ.5పైగా తగ్గే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక డిజిల్ ధర కూడా రూ.2 వరకు తగ్గనుంది. ఈ విషయాలన్ని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఎక్స్ వేదికగా తెలిపారు.
ధన త్రయోదశి సందర్భంగా పెట్రోలు పంపు డీలర్స్‌కి సంబంధించిన డిమాండ్స్‌ను నెరవేర్చుతూ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి భారీ బహుమతిని అందించారు. ఏడేళ్లుగా వస్తున్న డిమాండ్స్‌ను నెరవేర్చుతూ కీలక నిర్ణయం తీసుకుంది.
అలాగే సుదూర ప్రాంతాల్లో ఉండే పెట్రోల్, డిజిల్ వినియోగదారులకు బెనిఫిట్స్ లభించేందుకు అంతర్-రాష్ట్ర సరుకు రవాణ అప్డేట్‌పై చమురు కంపెనీలు, డీలర్స్ ప్రధాన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే కేంద్రమంది కొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్, డిజిల్ ధరలను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ఒడిశాలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్‌ను గరిష్టంగా రూ.4.69, డీజిల్‌పై రూ.4.45పైగా తగ్గించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు.
ఇక ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మాతో పాటు పలు ప్రాంతాల్లో పెట్రోల్ ధర రూ.2.09 తగ్గగా, డీజిల్ ధర రూ.2.02 తగ్గించిన్నట్లు కేంద్ర మంత్రి ఎక్స్ హ్యాండిల్ ద్వారా వెల్లడించారు. డీలర్ కమీషన్ పెంపు వల్ల పెరిగిన పెట్రోల్ ధరలు ఇతర ప్రాంతాల్లో కూడా త్వరలోనే తగ్గనున్నాయి.
త్వరలోనే డీలర్ కమీషన్ తగ్గడం వల్ల 7 కోట్ల మంది వాహన దారులకు లబ్ధి జరగనుంది. ఇప్పటికీ భారత్ వ్యాప్తంగా 83,000 పెట్రోల్ పంపులు ఉన్నాయి. అయితే కేంద్రం డిమాండ్లు నెరవేరడం వల్ల 10 లక్షల మంది ఉద్యోగులకు మేలు జరనుంది.
ఇప్పటికీ దీపావలి సందర్భంగా హిమాచల్ ప్రదేశ్‌లో కూడా పెట్రోల్ రూ.3.59పైగా తగ్గగా.. డీజిల్‌పై రూ.3.13 తగ్గినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా మిజోరంలో కూడా రూ. 2.73పైగా డిజిల్, పెట్రోల్ ధరలు తగ్గాయి.