Tirumala: శ్రీవారి భక్తులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఈ పనిచేస్తే ఒక్కరోజులోనే నేరుగా స్వామి వారి దర్శనం..

Tirumala News: తిరుమలకు ప్రతిరోజు లక్షలాదిగా భక్తులు స్వామివారి దర్శనం కోసం దూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. కొన్నిసార్లు రోజుల తరబడి క్యూ లైన్ లలో స్వామి దర్శనం కోసం వేచి చూడాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. 

1 /8

తిరుమల శ్రీవారిని కలియుగంలో చాలా మంది ఎంతో విశ్వసిస్తుంటారు. పిలిస్తే పలికే దైవంగా, కొంగు బంగారంగా కూడా చాలా మంది భక్తులు భావిస్తుంటారు. అందుకే దేశ, విదేశాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. కొంత మంది ప్రత్యేకంగా మొక్కులు తీర్చుకుంటారు.  

2 /8

అంతే కాకుండా.. కొంత మంది తలనీలాలు సమర్పిస్తే, మరికొందరు నిలువు దోపిడీలు కూడా స్వామి వారికి సమర్పించుకుంటారు. అయితే.. తిరుమలకు ప్రతిరోజు లక్షలాదిగా తరలివస్తుంటారు. కొంత మంది వీఐపీల సిఫారసుల తో తిరుమలకు వస్తుంటే, మరికొందరు ధర్మదర్శనం టోకెన్ లు తీసుకుని దర్శనంలైన్ లలో వేచీ ఉంటారు.  

3 /8

ఇదిలా ఉండగా.. తిరుమలలో కొన్నేళ్లుగా రక్తదానం చేస్తే తిరుమల శ్రీవారి దర్శనం అయ్యేలా కూడా ఏర్పాట్లు చేశారు. ఈ పథకంను  1985 నుంచి అమలు చేస్తున్నట్లు తెలుస్తొంది.. తిరుమల తిరుపతి దేవస్థానం 37 ఏళ్ల క్రితం తీసుకొచ్చిన ఈ పథకం గురించి చాలా మందికి ఇప్పటికి కూడా అవగాహాన లేదని సమాచారం.  

4 /8

రక్తదానాన్ని ప్రోత్సహించేలా తిరుమలకు వచ్చే భక్తులుఎవరైతే రక్తదానం చేస్తే, వారికి నేరుగా శ్రీవారి  దర్శనం అయ్యేలా చేయడంతో పాటు, ఉచిత లడ్డును కూడా అందించనున్నట్లు తెలుస్తొంది. అంతే కాకుండా.. ప్రశంసా పత్రంసైతం అందిస్తారంట.  

5 /8

రక్తదాతల కోసం కొండపైన అశ్విని ఆస్పత్రిలో ప్రత్యేకంగా ఏర్పాట్లు సైతం చేసినట్లు తెలుస్తొంది. ప్రస్తుతం బ్లడ్ డోనర్ లను 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూలైన్లో రక్తదాతలను అనుమతిస్తున్నారని సమాచారం.

6 /8

రక్తదానం చేసిన 24 గంటల్లోపు ఆ భక్తులను నేరుగా స్వామి వారి దర్శనం చేయంచేలా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తారంట.  తిరుమలలో రక్తదానం చేసిన భక్తులకు ఉచితంగా శీఘ్రదర్శనంతోపాటు,  ఒక ఉచిత లడ్డు, టీటీడీ తరఫున వారికి ఒక ప్రశంసాపత్రం కూడా ఇస్తున్నారని తెలుస్తొంది.   

7 /8

రక్త దానం చేసిన వెంటనే స్నాక్స్, పండ్లు ఇస్తారంట.. ఇక్కడ సేకరించిన రక్తాన్ని తిరుపతిలోని బర్డ్ హాస్పిటల్‌‌కు పంపుతారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. తిరుపతిలోని బర్డ్(బీఐఐఆర్‌డీ) ఆసుపత్రిలో టీటీడీ బ్లడ్ బ్యాంక్ ఉన్నట్లు తెలుస్తొంది.

8 /8

తిరుమలలో చాలా మంది భక్తులు రక్తదానం చేసి మరీ స్వామి వారి దర్శనం చేసుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అంతే కాకుండా.. దీనిపై ఎక్కువగా అవగాహాన కల్పించాలని కూడా కోరుతున్నారు.