Schools Closed: దీపావళి సెలవులు స్కూళ్లకు ఎన్నిరోజులు వచ్చాయి తెలుసా? విద్యాశాఖ కీలక ఆదేశాలు..!

Schools Closed on Diwali: దీపావళి సందర్భంగా ఆ స్కూళ్లకు ప్రభుత్వం వరుసగా మూడు రోజులు సెలవులు ప్రకటించింది. దీంతో వారు పండుగ చేసుకుంటున్నారు. దీపావళి సందర్భంగా విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. రేపు అక్టోబర్‌ 31న దీపావళి పండుగ సందర్భంగా విద్యార్థులకు ఈ తీపి కబురు అందించింది ప్రభుత్వం. అయితే, పూర్తి వివరాలు ఏంటి తెలుసుకుందాం.
 

1 /5

దీపావళి సందర్భంగా ఇప్పటికే యోగీ సర్కార్‌ ఉత్తరప్రదేశ్‌లో అక్టోబర్ 31 సెలవు ప్రకటించింది. ఆ తర్వాత నవంబర్‌ 2, 3 తేదీల్లో కూడా సెలవు ప్రకటించింది. అయితే, నవంబర్‌ 1వ తేదీ మాత్రం స్కూళ్లకు సెలవు లేదు. రెండో తేదీ గోవర్ధన పూజ ఉంది. గత నెల నుంచి వరుసగా స్కూళ్లకు సెలవులు వస్తున్నాయి  

2 /5

ఈ నేపథ్యంలో సమయానికి సిలబస్‌ పూర్తవుతుందో లేదో అనే సందిగ్ధంలో ఇటు టీచర్లతోపాటు అటు తల్లిదండ్రులు బాధపడుతున్నారు. తమిళనాడులో అయితే, అక్టోబర్‌ 31, నవంబర్‌ 1వ తేదీ స్కూళ్లు, కాలేజీలకు సెలవు వస్తున్నాయి. ఇక 2, 3వ తేదీలు శని, ఆదివారం కాబట్టి సెలవులు వస్తున్నాయి.  

3 /5

రాజస్థాన్‌ లో అక్టోబర్‌ 27 నుంచి నవంబర్‌ 7 వరకు దీపావళి పండుగ సెలవులు వచ్చాయి. మధ్యప్రదేశ్‌లో కూడా ఇదే పరిస్థితి శని, ఆదివారాలు కలిసి రావడంతో సెలవులు పెరిగాయి. బీహార్‌లో దీపావళి పండుగతోపాటు ఛత్‌ పూజ కూడా వైభవంగా నిర్వహిస్తారు కాబట్టి నవంబర్‌ 6 నుంచి 9 వరకు స్కూళ్లకు సెలవు ఉంది.  

4 /5

కర్నాటకలో అక్టోబర్‌ 31తోపాటు రాజోత్సవాల సందర్భంగా నవంబర్‌ 1న కూడా సెలవు ప్రకటించారు. అయితే ఎక్కువ శాతం ఇతర రాష్ట్రాల్లో అయితే, అక్టోబర్‌ 31 నుంచి నవంబర్‌ 3వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు. పండుగ మరుసటి రోజు నుంచి కార్తీక మాసం కూడా ప్రారంభం అవుతుంది.  

5 /5

ఇదిలా ఉండగా తెలుగు రాష్ట్రాల్లో కొన్ని పాఠశాలలు దీపావళి పండుగ సెలవు అక్టోబర్‌ 31న మాత్రమే ప్రకటించాయి. మరికొన్ని పాఠశాలలు శనివారం సెలవు ఇస్తున్నాయి. కానీ, నవంబర్ 1 శుక్రవారం మాత్రం తెలంగాణలో స్కూళ్లు పనిచేయనున్నాయి. ఇంకా అధికారికంగా ఈరోజు సాయంత్రం వరకు క్లారిటీ వస్తుంది.