Health Scheme: ఉచితంగా రూ.5,00,000 హెల్త్‌ స్కీమ్‌.. ఇలా వెంటనే దరఖాస్తు చేసుకోండి..!

PMJAY Health Scheme: ఈ కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా ఉచితంగా రూ.5 లక్షల వరకు వైద్య  సదుపాయం పొందవచ్చు. 70 ఏళ్లు పైబడిన వారు కూడా ఈ పథకానికి అర్హులు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ పథకం ద్వారా నేరుగా ఇంట్లో కూర్చొని దరఖాస్తు చేసుకోవచ్చు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
 

1 /5

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఆయుష్మాన్‌ భారత్‌ పథకం ద్వారా 70 ఏళ్లు పైబడిన వారు కూడా సులభంగా ఆరోగ్య చికిత్స ప్రయోజనాలు పొందవచ్చు. ఈ పథకం ఆయుష్మాన్‌ భారత్‌ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన (AB PM-JAY) అని పిలుస్తారు.  

2 /5

ఈ పథకం ద్వారా మన భారత దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఉచితంగా రూ.5 లక్షల వరకు ప్రయోజనాలు పొందవచ్చు. వారు మాత్రమే కాదు. సీనియర్ సిటిజెన్లు కూడా ఈ భారీ ప్రయోజనం పొందవచ్చు. 70 ఏళ్లు పైబడిన వారు కూడా ఈ పథకం పొందడానికి అర్హులు.  

3 /5

ఆయుష్మాన్‌ భారత్‌ ద్వారా ఇప్పటికే అర్హులైన కుటుంబాలకు 70 ఏళ్లు పైబడిన వారు అదనంగా రూ.5 లక్షలు టాప్ అప్‌ పొందవచ్చు. అయితే, ఈ టాప్‌అప్‌ 70 ఏళ్ల కంటే తక్కువ ఉన్న కుటుంబ సభ్యులతో షేర్‌ చేసుకోలేరు. ఇప్పటికే సీజీహెచ్‌ఎస్‌, ఈసీహెచ్‌ఎస్‌, సీఏపీఎఫ్‌ ద్వారా లబ్ది పొందుతున్నవారు కూడా ఈ పథకాన్ని ఎంచుకోవచ్చు లేదా అందులోనే కొనసాగవచ్చు.  

4 /5

ఈ పథకం ద్వారా ఆరుకోట్లు మంది సీనియర్ సిటిజెన్లు 4.5 కోట్లు కుటుంబాలు లబ్ది పొందుతాయి.వీరికి ప్రత్యేకంగా కార్డును జారీ చేశారు. దీన్ని యాప్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అన్ని వర్గాల వారు ఈ పథకం ప్రయోజనాలు పొందవచ్చు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆసుపత్రుల్లో ఈ కార్డు వర్తిస్తుంది.ఆయుష్మాన్‌ భారత్‌ కార్డు ప్రయోజనాలు పశ్చిమ బెంగాళ్‌, ఒడిషాలో ప్రారంభించలేదు.  

5 /5

ఈ కార్డు పొందాలంటే https://ayushmanup.in ట్యాబ్‌ క్లిక్‌ చేసి 'రిజిస్టర యూవర్‌ సెల్ప్‌ SETU' పై క్లిక్‌ చేయాలి. అప్పుడు పోర్టల్ ఓపెన్‌ అవుతుంది. అందులో రిజిస్టర్‌ చేసుకోవాలి. వివరాలు నమోదు చేసి సబ్మిట్‌  చేయాలి. ఆ తర్వాత కేవైసీ కూడా పూర్తి చేయాలి. కార్డును డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఆధార్‌ కార్డుకు ఓటీపీ వస్తుంది.