Fennel Celery Water: వారం రోజుల్లో.. ఒంట్లో ఉండే మొండి కొవ్వు మాయం..!

Fennel Celery Water: ఫెన్నెల్ (సోంపు), సెలరీ రెండూ ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందిన మూలికలు. ఈ రెండింటిని కలిపి తయారు చేసే నీరు శరీరానికి ఎంతో  శక్తిని ఇస్తుంది. ఈ వాటర్‌లో అనేక రకాల పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మన శరీరానికి అనేక రకాలుగా ఉపయోగపడతాయి. దీని తయారు చేసుకోవాలి, కలిగే లాభాలు గురించి తెలుసుకుందాం. 

1 /8

  ఫెన్నెల్ ,  సెలరీ రెండూ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.  ఈ రెండిటిని కలిపి తీసుకోవడం వల్ల ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం సమస్యలు తగ్గుతాయి.  

2 /8

ఈ వాటర్ శరీరంలోని జలదోషాన్ని తొలగించి, జీవక్రియను వేగవంతం చేస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

3 /8

ఈ వాటర్‌లో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచి, వ్యాధుల నుంచి రక్షిస్తాయి. అలాగే చర్మాన్ని మెరుగుపరుస్తుంది. ముఖంపై వచ్చే మొటిమలు, మచ్చలు తగ్గిస్తాయి.

4 /8

ఫెన్నెల్ (సోంపు), సెలరీ జ్యూస్‌తో పొట్టపై ఉండే కొవ్వును తగ్గించుకోవచ్చు. అయితే ఈ జ్యూస్ ను ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. 

5 /8

కావాల్సి పదార్థాలు: ఫెన్నెల్ గింజలు, సెలరీ, నీరు , నిమ్మరసం, జ్యూసర్ వీటిని తీసుకోవాల్సి ఉంటుంది. 

6 /8

తయారీ విధానం: ఫెన్నెల్ , సెలరీ కాండాలను శుభ్రంగా కడిగి, వాటి చివర భాగాలను తొలగించండి.  

7 /8

కడిగిన కూరగాయలను జ్యూసర్‌లో వేయడానికి అనువైన పరిమాణంలో ముక్కలుగా కోయండి. ముక్కలుగా కోసిన ఫెన్నెల్,  సెలరీని జ్యూసర్‌లో వేసి, జ్యూస్ తీయండి.  

8 /8

 జ్యూస్‌లో నీరు లేదా నిమ్మరసం కలిపి రుచిని మెరుగుపరచుకోవచ్చు. తయారైన జ్యూస్‌ను ఒక గ్లాసులోకి పోసి వెంటనే తాగండి.