Palm Jumeirah Penthouse Price: మనకు దుబాయ్ పేరు చెప్పగానే భారీ లైట్ల వెళుతురులో పెద్ద పెద్ద బిల్టింగ్‌లు మన కళ్ల ముందు కనిపిస్తాయి. తాజాగా పామ్ జుమేరా ద్వీపంలో భారీ ఎత్తున్న పెంట్ హౌస్‌ను నిర్మిస్తున్నారు. అయితే ఈ హౌస్ నిర్మాణం పూర్తి కాకముందే.. రూ.1134 కోట్లకు అమ్ముడుపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎందుకు అంత ప్రత్యేకత..?
పామ్ జుమేరా ద్వీపంలో దాదాపు 2200 చదరపు అడుగుల విస్తీర్ణంలో పెంట్ హౌస్ నిర్మిస్తున్నారు. ఈ హౌస్ నిర్మాణం పూర్తి కాకముందే.. కొనుగోలుదారుల మధ్య పోటీ నెలకొంది. దీంతో ఈ ఇల్లు రేటు అమాంతం పెరిగిపోయింది.
చివరకు రూ.1134 కోట్లకు ఓ వ్యక్తి కొనుగోలు చేశారు. రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇదే అత్యంత ఖరీదైన డీల్‌గా చెబుతున్నారు.
దుబాయ్‌లోని విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌గా నిర్మిస్తున్న ఈ భవనంలో 2 BHK నుంచి 5 BHK వరకు ఫ్లాట్లు ఉన్నాయి.
పామ్ జుమేరా అంటే నీటిపై తేలియాడే నగరం. ఈ ద్వీప నిర్మాణానికి మధ్యప్రదేశ్‌లోని ఛతర్పూర్ జిల్లా నుంచి రాళ్లను తీసుకువెళ్లి ఉపయోగించడం విశేషం.
అపార్ట్మెంట్లోని 71వ అంతస్తులో ఐదు పడక గదుల పెంట్ హౌస్‌ను నిర్మిస్తున్నారు. జుమేరా దీవిని కృత్రిమంగా అభివృద్ధి చేశారు. ఈ ద్వీపం విల్లాలు, విలాసవంతమైన హోటళ్లు, విలాసవంతమైన జీవితానికి ప్రసిద్ధి చెందింది.