Mercury And Rahu Conjunction In Pisces: ఫిబ్రవరి నెల గ్రహ సంచారాల పరంగా చాలా ప్రత్యేకమైనగా భావించవచ్చు. ఎందుకంటే ఇదే నెలలో కొన్ని శక్తివంతమైన గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. ముఖ్యంగా ఫిబ్రవరి 27న మీనరాశిలోకి బుధుడు ప్రవేశించబోతున్నాడు. అలాగే ఇప్పటికీ అందులో రాహువు గ్రహం సంచార దశలో ఉండడం వల్ల ఈ రెండు గ్రహాల కలయిక జరుగుతుంది. దీని వల్ల ఎంతో శక్తివంతమైన ప్రభావం ఏర్పడుతుంది.
ఫిబ్రవరి 27న బుధుడు మీన రాశిలోకి ప్రవేశించడం వల్ల రాహువు, బుధుడి కలయిక జరుగుతుంది. దీని వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా ఆర్థికంగా వస్తున్న సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే ఆరోగ్యం కూడా చాలా బాగంటుంది.
వృశ్చిక రాశివారికి ఈ రెండు గ్రహాలు మీన రాశిలో కలయిక జరపడం వల్ల అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. అంతేకాకుండా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారికి ఈ సమయం చాలా బాగుంటుంది. అలాగే ఎప్పటి నుంచో ఉద్యోగాలు మారాలని చూస్తున్నవారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది.
అలాగే వృశ్చిక రాశివారికి మతపరమైన కార్యకలాపాలపై శ్రద్ధ కూడా విపరీతంగా పెరుగుతుంది. మానసిక ప్రశాంతత కూడా పెరుగుతుంది. దీనికి కారణంగా ఎంతో హ్యాపీగా జీవితం గడుపుతారు. అలాగే పిల్లల నుంచి కూడా కొన్ని శుభవార్తలు వింటారు. కుటుంబ జీవితంలో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.
వృషభ రాశివారికి ఈ ఫిబ్రవరి 27వ తేది నుంచి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా భవిష్యత్తుకు సంబంధించిన విషయాల్లో కూడా మంచి సంతోషాన్ని పొందుతారు. దీంతో పాటు ఎప్పటి నుంచో ఉద్యోగాలు పొందాలనుకునేవారికి ఈ సమయం చాలా వరకు అనుకూలిస్తుంది.
వృషభ రాశివారికి కోరుకున్న ప్రదేశాల్లో కూడా ఉద్యోగాలు లభిస్తాయి. అంతేకాకుండా కుటుంబ సభ్యులు, స్నేహితల నుంచి సపోర్ట్ లభించి అద్భుతమైన ఆర్థిక లాభాలు పొందుతారు. అలాగే మానసిక సమస్యలు కూడా తొలగిపోతాయి.
బుధుడు, రాహువు మీన రాశిలో కలయిక జరపడం వల్ల కుంభ రాశివారికి పూర్వీకుల వ్యాపారాల నుంచి ఊహించని లాభాలు కలుగుతాయి. అలాగే వీరికి ప్రత్యేకమైన ప్రయోజనాలు కలుగుతాయి. దీంఓత పాటు అకస్మాత్తుగా ఆర్థిక లాభాలు కూడా కలుగుతాయి.