Elon Musk: ప్రపంచ ధనవంతుడు ఎలాన్ మాస్క్.. 10 ఆసక్తికర విషయాలు

టెస్లా మరియు స్పేస్‌ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అయ్యారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌ను అధిగమించి ప్రపంచ కుబేరుడిగా ఎలాన్ మస్క్ నిలిచారు.
  • Jan 08, 2021, 10:30 AM IST

Facts About Elon Musk: టెస్లా మరియు స్పేస్‌ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అయ్యారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌ను అధిగమించి ప్రపంచ కుబేరుడిగా ఎలాన్ మస్క్ నిలిచారు.

1 /10

Facts About Elon Musk: టెస్లా మరియు స్పేస్‌ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు అయ్యారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌ను అధిగమించి ప్రపంచ కుబేరుడిగా ఎలాన్ మస్క్(Elon Musk)  నిలిచారు.

2 /10

అక్టోబర్ 2017 నుంచి అపర కుబేరుడిగా కొనసాగుతున్న అమెజాన్(Amazon) వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌ను అధిగమించాడు. 500 మంది కుబేరులతో బ్లూమ్‌బర్గ్ రూపొందించిన బిలియనీర్స్ జాబితా ఈ విషయాన్ని వెల్లడించింది.  Also Read: Cheapest Data Plans: ఎయిర్‌టెల్, జియో, బీఎస్ఎన్ఎల్ మరియు విఐ బెస్ట్ ప్లాన్స్ ఇవే..

3 /10

ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ పేరిట, జెఫ్ బెజోస్ బ్లూ ఆరిజిన్ ఎల్ఎల్‌సీ పేరిట ప్రపంచ కుబేరులు ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్‌లు ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన కంపెనీలు నిర్వహిస్తుండగం గమనార్హం.

4 /10

ఎలాన్ మస్క్ సంపద నికర విలువ గురువారం నాటికి 188.5 బిలియన్ డాలర్లకు చేరింది. భారత కరెన్సీలో దీని విలువ సుమారు రూ.14.13 లక్షల కోట్లు. 

5 /10

ప్రపంచ కుబేరుడుగా ఎలాన్ మస్క్‌కు దక్షిణాఫ్రికా, కెనడా, అమెరికా దేశాల పౌరసత్వం ఉంది. Also Read : ​Benifits Of EPF Account: మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా.. ఈ బెనిఫిట్స్ తెలుసా!

6 /10

కేవలం 9 ఏళ్ల వయసులోనే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ సొంతం నేర్చుకోవడం ప్రారంభించాడు ఎలాన్ మస్క్. 12 ఏళ్ల వయసులోనే బ్లాస్టర్ అనే స్పేస్‌కు సంబంధించిన గేమ్ రూపొందించి విక్రయించాడు.

7 /10

చిన్న వయసు నుంచే సొంతంగా రాకెట్ తయారు చేయడం ప్రారంభించిన వ్యక్తి ఎలాన్ మస్క్. ఆసక్తితోనే ప్రైవేట్ స్పేస్ కంపెనీని నిర్వహిస్తున్నాడు. రెండు సార్లు కాలేజీ, యూనివర్సిటీ నుంచి డ్రాపౌట్ అయ్యాడు.

8 /10

చిన్నప్పుడు ఎక్కువగా మాట్లాడకపోయే స్వభావం ఉండటంతో చెవిటివాడు అయినందున తమ కుమారుడు ఏం వినడం లేదని, అందుకే మాట్లాడటం లేదని ఎలాన్ మస్క్ తల్లిందండ్రులు భావించేవారు.

9 /10

ఎలాన్ మస్క్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. అయితే ముగ్గురు భార్యలతోనూ విడాకులు తీసుకున్నాడు. ఇయనకు ఆరుగురు సంతానం కాగా, అంతా అబ్బాయిలే. ప్రస్తుతం గ్రైమ్స్ అనే తన ప్రియురాలితో డేటింగ్‌లో ఉన్నాడని తెలిసిందే.  Also Read: Credit Card Tips: ఫస్ట్ టైం క్రెడిట్ కార్డు తీసుకుంటున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి

10 /10

ఎలాన్ మస్క్(Elon Musk)కు చెందిన ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా విలువ గురువారం 7.4 శాతం పెరిగి.. 811 డాలర్ల గరిష్ట స్థాయికి చేరడంతో ఆయన అత్యంత ధనవంతుడు అయ్యారు. Also Read: Xiaomi Mi 10i Price: భారత్‌లో 108 MP కెమెరా ఫోన్ లాంచ్, ఫీచర్లు, ధర పూర్తి వివరాలు ఇవే