EPFO 8.5% PF interest benefits: ఆరు కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. 2019-20 ఏడాదికి సంబంధించిన వడ్డీని ఈపీఎఫ్ ఖాతాలలో జమచేయనున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు తెలుస్తోంది.
ఆరు కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. 2019-20 ఏడాదికి సంబంధించిన వడ్డీని ఈపీఎఫ్ ఖాతాలలో జమచేయనున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు తెలుస్తోంది. ఆన్లైన్లో, మిస్డ్ కాల్ ద్వారా, ఎస్ఎంఎస్ ద్వారా PF Balance చెక్ చేసుకునే అవకాశం ఉంది. Also Read : Benifits Of EPF Account: మీకు ఈపీఎఫ్ అకౌంట్ ఉందా.. ఈ బెనిఫిట్స్ తెలుసా!
దీంతో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్(EPFO), కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ ఖాతాదారులకు నూతన సంవత్సర కానుక అందించనున్నారు. మొత్తం 8.5శాతం వడ్డీని తొలుత రెండు దఫాలుగా ఈపీఎఫ్ ఖాతాదారులకు అందించాలని నిర్ణయించారు.
ఏ క్షణంలోనైనా ఈపీఎఫ్ఓ(EPFO) పీఎఫ్ ఖాతాల్లో వడ్డీ జమ కానుంది. ఈపీఎఫ్ ఖాతాదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. పీఎఫ్ బ్యాలెన్స్‌ను పలు విధాలుగా చెక్ చేసుకోవచ్చు. ఆ వివరాలు మీకోసం
తొలుత http://epfindia.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. అందులో మీ యూఏఎన్ నెంబర్, పాస్వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి ఈ పాస్‌బుక్ మీద క్లిక్ చేయండి అక్కడ మీ వివరాలు నమోదు చేసిన తర్వాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది మెంబర్ ఐడీ వివరాలు సబ్మిట్ చేస్తే ఈపీఎఫ్ బ్యాలెన్స్(PF Balance) వివరాలు కనిపిస్తాయి Also Read : PF Balance Missed Call Number: పీఎఫ్ బ్యాలెన్స్ ఇలా తెలుసుకోవచ్చు.. ఒక్క మిస్డ్ కాల్ చాలు
ఈపీఎఫ్ఓ ఖాతాదారులు రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ ద్వారా ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు ఫోన్‌కు వస్తాయి. యూఏఎన్ నెంబర్‌తో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ నుంచి 011-22901406కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. ఈపీఎఫ్ వివరాలు వెంటనే మీ రిజిస్టర్ మొబైల్‌కు పంపిస్తారు. Also Read: EPFO: పీఎఫ్ నగదు విత్‌డ్రా చేస్తున్నారా.. ఈ తప్పులు అసలు చేయవద్దు!