EPFO Updates: పీఎఫ్ ఖాతాదారుల శాలరీ నుంచి ప్రతి నెలా 12 శాతం ఈపీఎఫ్ అకౌంట్‌లోకి జమ అవుతుంది. అంతే మొత్తంలో ఆ ఉద్యోగి పని చేస్తున్న కంపెనీ కూడా జమ చేస్తుంది. ఈ డబ్బులను ఉద్యోగి భవిష్యత్ అవసరాల మేరకు విత్ డ్రా చేసుకోవచ్చు. ఈపీఎఫ్ సభ్యుల ప్రయోజనం, సౌలభ్యం కోసం పాత నిబంధనలను మార్చి.. ఎప్పటికప్పుడు కొత్త రూల్స్‌ను పరిచయం చేస్తుంది ఈపీఎఫ్‌ఓ. తాజా అప్‌డేట్స్ మీ కోసం..
ఈపీఎఫ్‌ఓ రీసెంట్‌గా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) ట్రాన్స్‌ఫర్‌పై సోషల్ మీడియా వేదికగా లైవ్ సెషన్ నిర్వహించింది. ఈ సెషన్‌ను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో 25 వేల మందికి పైగా చూశారు.
ఈపీఎఫ్ అధికారులు ఈ సెషన్‌కు హాజరై కీలక విషయాలను వెల్లడించారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
ముఖ్యంగా ఈపీఎఫ్ ట్రాన్స్‌ఫర్ ప్రాముఖ్యతను వివరించిన అధికారులు.. అన్ని ఈపీఎఫ్ అకౌంట్‌లను ఏకీకృతం చేయడం ద్వారా.. సభ్యులు వ్యక్తిగత అడ్వాన్స్/పాక్షిక ఉపసంహరణ సౌకర్యాన్ని పొందుతారని చెప్పారు. అంతేకాకుండా టీడీఎస్‌ను నివారించి పెన్షన్ పొందుతారని చెప్పారు.
మినహాయింపు పొందిన కంపెనీల ఈపీఎఫ్ ట్రాన్స్‌ఫర్ గురించి కూడా వివరించారు. ఈ సెషన్ చూడలేకపోయిన వారు https://www.youtube.com/watch?v=CqBIJ6LQa8c లింక్ ఓపెన్ చేసి చూడొచ్చు.
EPFO ప్రయోజనాలు, సేవలు, ప్రక్రియల గురించి తెలుసుకోవడానికి, ఈపీఎఫ్ సభ్యుల సందేహాలను నివృత్తి చేయడానికి ప్రతి నెల రెండో మంగళవారం ఈ సెషన్ నిర్వహిస్తున్నారు.
ఈసారి లైవ్ సెషన్ సెప్టెంబర్ 10న నిర్వహిస్తారు. ఈ సెషన్‌కు సంబంధించిన అంశం ముందుగానే సోషల్ మీడియా ద్వారా అధికారులు వెల్లడిస్తారు.
గమనిక: ఇక్కడ అందజేసిన సమాచారం కేవలం ఉద్యోగుల ప్రయోజనాల కోసం మాత్రమే రాసినది. కచ్చితమైన సమాచారం కోసం అధికారిక సైట్‌లను సందర్శించండి.