Srinagar Tourist Places: శ్రీనగర్ పర్యాటక ప్రాంతాలు ఎంత అందంగా ఉన్నాయో చూశారా

  • Jan 24, 2021, 18:46 PM IST

 

Srinagar Tourist Places: అందమైన ప్రాంతాల్లో తిరగడం, ఎంజాయ్ చేయడమంటే శీతాకాలంలోనే. ఒకవేళ మీకు కూడా హిమపాతం, అందమైన దృశ్యాల్ని చూసే ఆసక్తి ఉంటే..స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో వెంటనే శ్రీనగర్ ట్రిప్ వేసేయండి. శ్రీనగర్ ప్రకృతి అందాల్ని తిలకించేందుకు సుదూర ప్రాంతాల్నించి పర్యాటకులు వస్తుంటారు. శ్రీనగర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల గురించి తెలుసుకుందాం..

1 /5

దాల్ సరస్సు తీరాన హజ్రత్‌బల్ మస్జిద్ ( Hazratbal Mosque ) ఉంది. ఈ మసీదును తెల్లడి మార్బుల్ రాయితో నిర్మించారు. ఈ మసీదును అసర్ ఎ షరీఫ్‌గా  కూడా పిలుస్తారు. ఈ అందమైన మసీదును చూసేందుకు ...నమాజ్ చదివేందుకు దూరప్రాంతాల్నించి పర్యాటకులు పెద్దఎత్తున వస్తుంటారు. 

2 /5

శంకరాచార్య ఆలయం ( Shankaracharya temple )..శ్రీనగర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఒకటి. ఈ మందిరాన్ని ఎత్తైన కొండపై నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణం క్రీస్తుపూర్వం 2 వందల సంవత్సరంలో అశోకుడి కుమారుడు జలుకా నిర్మించారు. ఈ ఆలయాన్ని సందర్శిస్తే ..ప్రశాంతత లభిస్తుంది. ఇక్కడి ప్రకృతిలోని అందమైన దృశ్యాలు కూడా ప్రత్యేక ఆకర్షణలుగా ఉంటాయి.

3 /5

మొఘల్ గార్డెన్ ( Mughal gardens ) శ్రీనగర్ ప్రముఖ పర్యాటన ప్రాంతాల్లో ఒకటి. ఈ గార్డెన్‌ను మొఘల్స్ సమయంలో నిర్మించారు. మొఘల్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన షవర్లు పర్యాటకుల్ని తమవైపుకు ఆకర్షిస్తాయి. అందుకే శ్రీనగర్ వెళ్లినప్పుడు మొఘల్ గార్డెన్ చూడటం మర్చిపోవద్దు.

4 /5

నిషాత్ తోట ( Nishat Bagh )లో ఉన్న విభిన్న రకాల అరుదైన అందమైన పూలను చూసేందుకు దేశవిదేశాల్నించి పర్యాటకులు వస్తుంటారు. నిషాత్ తోటను దాల్ సరస్సు తీరానే నిర్మించారు. ఈ తోటను అబ్దుల్ ఆసఫ్ ఖాన్..1663లో నిర్మించారు. ఈ తోటను గార్డెన్ ఆఫ్ జాయ్ అని పిలుస్తారు. శ్రీనగర్ వెళ్లినప్పుడు నిషాత్ బాగ్ చూడటం మర్చిపోవద్దు.

5 /5

శ్రీనగర్ చూడ్డానికి వెళితే మాత్రం దాల్ సరస్సు ( Dal Lake ) ను తప్పకుండా చూడండి. ఇది శ్రీనగర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం. ఈ సరస్సులో ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎటు చూసినా పర్యాటకులే కన్పిస్తారు. ఇక్కడి అందాలు అందర్నీ ఆకర్షిస్తాయి. ఈ సరస్సులో హౌస్‌బోట్ ఎంజాయ్‌మెంట్ పొందవచ్చు.