Farmer Hanumantha Clinches Bigg Boss Kannada Trophy Here Cash Prize Details: మరోసారి బిగ్‌బాస్ విజేతగా రైతు బిడ్డ నిలిచాడు. అయితే తెలుగులో కాదు కన్నడ బిగ్‌బాస్ షోలో. కన్నడ సీజన్ 11 ముగియగా ఆఖరి రోజు విజేతగా హనుమంత నిలిచాడు. అతడు ఎవరు? ఎంత క్యాష్ ప్రైజ్ వచ్చిందో తెలుసుకుందాం.
రైతు బిడ్డలు వినోద రంగంలోనూ దుమ్ము ధులిపేతస్తున్నారు. సామాజిక మాధ్యమాలను వినియోగించుకుని వారు ఇన్‌ఫ్లుయెన్సర్లుగా రాణిస్తున్నారు. తాజాగా కన్నడ బిగ్‌బాస్ షోలో కూడా రైతు బిడ్డ విజేతగా నిలిచాడు.
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా.. డ్యాన్సర్‌గా.. గాయకుడిగా గుర్తింపు పొందిన ఓ రైతు బిడ్డ తాజాగా బిగ్‌బాస్ షో విజేతగా నిలిచాడు. తోటి కంటెస్టెంట్లతో తీవ్ర పోటీని ఎదుర్కొని చివరకు ట్రోఫీని అందుకున్నాడు.
కన్నడ బిగ్‌బాస్ సీజన్ 11 ప్రారంభమవగా.. 120 రోజులు ఉత్కంఠగా ఈ షో నడిచింది. 21వ రోజున వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన రైతు బిడ్డ హనుమంత హౌస్‌లో ఉన్నన్నాళ్లు గట్టిగా పోరాడి.. అన్నిట్లో రాణించి చివరకు ట్రోఫీ సాధించాడు.
హనుమంత ఎవరో కాదు కర్ణాటకలోని హవేరికి చెందిన హనుమంత రైతుగా గుర్తింపు పొందాడు. మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన హనుమంత సొంతూరులోనే డిగ్రీ చదివి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా గుర్తింపు పొందాడు.
2018 సరిగమప కన్నడ 15వ సీజన్‌లో హనుమంత రన్నరప్‌గా నిలిచాడు. 2019లో డ్యాన్స్ కర్ణాటక డ్యాన్స్ సీజన్ 2లో హనుమంత పాల్గొని డ్యాన్స్‌లో కూడా రాణించాడు.
బిగ్‌బాస్ కన్నడ విజేతగా నిలిచిన హనుమంత రూ.50 లక్షల నగదు బహుమతితోపాటు ట్రోఫీ సొంతం చేసుకున్నాడు. దీంతోపాటు ఓ లగ్జరీ కారును గెలిచాడు. రన్నరప్‌గా త్రివిక్రమ్ నిలవగా.. రూ.10 లక్షలు గెలుచుకున్నాడు.