Financial Tips: సెప్టెంబర్ 30వ తేదీలోపు పూర్తి చేయాల్సిన పనులు ఇవే..!

September Financial Works: ప్రతి నెల మాదిరే సెప్టెంబర్ నెలలో పూర్తి చేయాల్సిన కొన్ని ముఖ్యమైన పనులు ఉన్నాయి. ఈ పనులను ఈ నెల 30వ తేదీలోపు కంప్లీట్ చేయకపోతే మీరు నష్టపోయే అవకాశం ఉంది. సెప్టెంబర్ 30లోపు చేయాల్సిన పనులు ఇవే..
 

  • Sep 17, 2023, 23:15 PM IST
1 /4

ఆర్బీఐ రూ.2000 నోటును విత్ డ్రా చేసుకుంది. బ్యాంకులలో డిపాజిట్ చేసుకునేందుకు ఈ నెల 30వ తేదీ వరకు మాత్రమే అవకాశం ఉంది. సెప్టెంబర్ చివరి నాటికి తమ వద్ద ఉన్న 2000 రూపాయల నోటును డిపాజిట్ చేయాలి లేదా బ్యాంకు నుంచి మార్చుకోవాల్సి ఉంటుంది.  

2 /4

సీనియర్ సిటిజన్ల కోసం ఎస్‌బీఐ స్పెషల్ ఎఫ్‌డీ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేయడానికి చివరి తేదీ  సెప్టెంబర్ 30. SBI WeCare స్పెషల్ ఎఫ్‌డీ పథక ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్ల కోసం ప్రవేశపెట్టింది ఎస్‌బీఐ. ఈ స్కీమ్ కింద 7.5 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది.   

3 /4

ఐడీబీఐ అమృత్ మహోత్సవ్ ఎఫ్‌డీ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టేందుకు సెప్టెంబర్ 30న చివరి తేదీ. 375 రోజుల ఈ ఎఫ్‌డీ స్కీమ్‌లో సాధారణ వినియోగదారులకు 7.10 శాతం, సీనియర్ సిటిజన్‌లకు 7.60 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. 444 రోజుల ఎఫ్‌డీ కింద సాధారణ వినియోగదారులకు 7.15 శాతం వడ్డీ, సీనియర్ సిటిజన్లకు 7.65 శాతం వడ్డీని అందజేస్తోంది.   

4 /4

డీమ్యాట్, మ్యూచువల్ ఫండ్‌లలో నామినీ వివరాలను అందించడం చాలా ముఖ్యం. నామినీని సూచించడానికి లేదా నామినీని నిలిపివేయడానికి ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాదారులు, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిదారులకు సెబీ ఈ నెల 30వ తేదీ వరకు అవకాశం ఇచ్చింది.