Flight charge: సంక్రాంతికి ఫ్లైట్ లో ప్రయాణించే వారికి షాకింగ్ న్యూస్.. ఒక్కో టికెట్ ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం

Flight charge: హైదరాబాద్ బెంగళూరు నుంచి విశాఖపట్నం వచ్చేవారికి విమానం టికెట్ ధరలు షాకిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి కనీస చార్జీ 17,500 చెల్లించాల్సి వస్తుంది. అదే బెంగళూరు నుంచి విశాఖపట్నం వెళ్లాలంటే కనీసం రూ. 12 వేల రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. సంక్రాంతి పండగ రద్దీ ద్రుష్ట్యా విమాన చార్జీలు భారీగా పెరిగాయి.
 

1 /5

Flight charge: సంక్రాంతి పండుగ నేపథ్యంలో పట్టణాల్లోని ప్రజలంతా పెద్ద ఎత్తున తమ తమ సొంత ఊరులకు బయలుదేరుతున్నారు. దీంతో బస్సులు, రైలు రద్దీతో కిక్కిరిసిపోతున్నాయి. మూడు, నాలుగు నెలల క్రితమే ట్రైన్ రిజర్వేషన్ చేసుకున్న వెయిటింగ్ లిస్టులు మాత్రం భారీగానే ఉన్నాయి

2 /5

 ప్రత్యేక బస్సులు రైలు ఎన్ని వేసినా నిమిషాల వ్యవధిలోని సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో నిండిపోతున్నాయి. ఈ క్రమంలోనే ప్రయాణికులు ప్రత్యామ్నాయ దారులను వెతుక్కుంటున్నారు. దీంతో విమాన టికెట్లకు కూడా  డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.  

3 /5

హైదరాబాద్ బెంగళూరు  నుంచి విశాఖపట్నం వెళ్లాలనుకునే వారికి విమాన టికెట్ ధరలు భారీ షాకిస్తున్నాయి.  జనవరి 11వ తేదీ 12వ తేదీల్లో హైదరాబాద్ నుంచి కనీస చార్జీ 17,500 కి పైమాటే ఉన్నాయి. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బెంగళూరు నుంచి వైజాగ్ వెళ్లాలంటే కనీసం 12 వేల రూపాయలు చార్జీ చెల్లించాల్సి వస్తుంది.

4 /5

నలుగురు సభ్యులు ఉన్న ఫ్యామిలీ వెళ్లాలంటే 50 వేల నుంచి 70 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. సాధారణ రోజుల్లో హైదరాబాద్ బెంగళూరు నుంచి కనీస ధరలు మామూలుగా 3400 నుంచి 4000 రూపాయలు ఉండేది.

5 /5

సొంతూర్లకు వెళ్లాలనే ప్రయాసతో కొంతమంది వేలకు వేలు పెట్టుకుని మరి కుటుంబాలతో ఫ్లైట్ జర్నీ సాగిస్తున్నారు.