Remedies for Cough and cold : డిసెంబర్ రానే వచ్చేసింది. చలి మరింతగా గిలిగింతలు పెట్టనుంది. దాంతో పాటు కొన్ని ఇక్కట్లు కూడా తీసుకొస్తుంది. ఈ కాలో జలుబు, దగ్గు అనేవి సాధారణం. పిల్లలు పెద్దలూ అనే తేడాలేవీ లేకుండా ఇబ్బంది పెడతాయి ఈ జలుబు దగ్గు...
కరోనావైరస్ సెకండ్ వేవ్ (Coronavirus Second Wave) భారత దేశంలో విస్తరిస్తున్న తరుణంలో జలుబు, దగ్గులను ఎట్టి పరిస్థితిలో లైట్ తీసుకోవద్దు. ఎందుకంటే అవే కోవిడ్-19 ప్రధాన లక్షణాలు.
జలుబు , దగ్గు (Cough and Cold ) అనేవి సీజనల్ వచ్చేవాటిలో ఒకటి. ఇలాంటి సమయంలో మీరు వైద్యులను సంప్రదించండి. దాంతో పాటు ఈ చిట్కాలు పాటిస్తే త్వరగా కోలుకోవచ్చు.
Steaming For Cough and Cold | ముక్కు బ్లాక్ అయిందా.. అయితే ఆవిరి పట్టండి. దీని కోసం మార్కెట్లో స్టీమింగ్ మెషిన్లు దొరుకుతాయి. లేదంటే నీల్లు వేడి చేసి అందులో కొంచెం పసుపు వేసి ఆవిరి పీల్చుకోండి.
Turmeric Food For Cough and Cold : గోరువెచ్చని పాలల్లో చిటికెడు పసుపు వేసుకొని తగండి. దీని వల్ల ఇమ్యూనిటీ పెరగడంతో పాటు ఇందులో ఉండే ఆంటీ బ్యాక్టిరియా గుణాలు మీ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి.
Amala For Cough and Cold: విటమిన్ సి (Vitamin C) పుష్కలంగా ఉండే అమ్లాను తీసుకుంటే ఆరోగ్యం త్వరగా మెరుగు పడుతుంది.