Happy Gandhi Jayanti 2024: గాంధీ జయంతి ప్రతి సంవత్సరం అక్టోబర్ 2న భారతదేశం మొత్తం ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజు మహాత్మా గాంధీ గారి జయంతి. మహాత్మా గాంధీ అహింసా మార్గంలో భారతదేశాన్ని బ్రిటిష్ వారి పాలన నుంచి విముక్తి చేసిన మహనీయుడు. ఆయన ఆదర్శాలు, త్యాగాలు మనల్ని ఎప్పటికీ ప్రేరేపిస్తూనే ఉంటాయి. గాంధీజీ సత్యం, అహింస, సర్వోదయం వంటి ఆదర్శాలను ప్రచారం చేశారు. ఈ ఆదర్శాలను మన కూడా పాటించాల్సి ఉంటుంది. గాంధీ జయంతి సందర్భంగా మీ బంధు మిత్రులకు ఈ శుభాకాంక్షలను తెలపండి.
అహింస తన ఆయుధం.. జాతిపితగా కీర్తిగాంచిన ఓ మహాత్మా అజరామరం నీ ఖ్యాతి... గాంధీ జయంతి శుభాకాంక్షలు!
మహాత్మా గాంధీ గారి ఆదర్శాలను అనుసరిస్తూ సమాజంలో అహింస, సమానత్వాన్ని ప్రాచుర్యం కల్పిద్దాం.. 2024 గాంధీ జయంతి శుభాకాంక్షలు..!
మహాత్మా గాంధీ గారి ఆశయాలను మనం ప్రతిరోజూ జీవితంలో పాటిస్తూ సమాజాన్ని మంచి దిశగా నడిపిద్దాం.. గాంధీ జయంతి శుభాకాంక్షలు 2024..!
పుస్తకం గొప్పతనం అందులో ఉండే విషయం మీద ఆధారపడదు అది మనకు అందించే ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది.. అందరీకి గాంధీ జయంతి శుభాకాంక్షలు..!
2024 గాంధీ జయంతి శుభాకాంక్షలు! నిండు హృదయంతో జాతికి సేవ చేయాలని మనసులో పెట్టుకున్న మహానీయుడు గాంధీ గారి జయంతి
సత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహాత్మా గాంధీకి 2024 గాంధీ జయంతి శుభాకాంక్షలు.