How To Reduce Gastric Problem: గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఈ ఆహారాలు తినడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇందులో ఉండే గుణాలు మలబద్దకంతో పాటు ఇతర అన్ని పొట్ట సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది.
Gastric Problem Solution Home Remedies: గ్యాస్ట్రిక్ కారణంగా భవిష్యత్‌లో అనేక పొట్ట సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఈ సమస్య నుంచి ఎంత తొందరగా ఉపశమనం పొందితే అంతమంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ గ్యాస్ట్రిక్ సమస్య బారిన పడడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో మొదటి కారణం అనారోగ్యకరమైన ఆహారాలు అతిగా తినడమైతే.. రెండవది మద్యం అతిగా సేవించడమని నిపుణులు చెబుతున్నారు.
ప్రతి రోజు గ్యాస్ట్రిక్ సమస్య కారణంగా చాలా మంది ఇతర పనులు కూడా చేయలేకపోతున్నారు. అంతేకాకుండా ఇతర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే దీనిని నుంచి ఉపశమనం పొందడానికి ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
జీలకర్ర నీటిని ప్రతి రోజు ఉదయం ఖాళీ కడుపుతో తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతేకాకుండా గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు కూడా సులభంగా తగ్గుతాయి.
పెరుగులో ఉండే ఆరోగ్యకరమైన ప్రోబయోటిక్స్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. ఇది గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలను తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది.
బాదంలో ఫైబర్ కూడా పుష్కలంగా లభిస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచేందుకు ఎంతగానో సహాయపడుతుంది. కాబట్టి రోజు బాదం పాలు తాగడం వల్ల పొట్టలో మంట తగ్గుతుంది. దీని కారణంగా గ్యాస్ట్రిక్ సమస్య నుంచి విముక్తి కలుగుతుంది.
ఎవైనా అనారోగ్యకరమైన ఆహారాలు ప్రతి రోజు తీసుకునేవారు తప్పకుండా అరటి పండు తినాల్సి ఉంటుంది. ఇందులో లభించే పొటాషియం, ఫైబర్ కడుపులో ఆమ్లాన్ని తగ్గించి, మంటను తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
కీరాలలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు కూడా ఎక్కువ మోతాదులో లభిస్తాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరిచి కడుపులో వాయువు తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
బొప్పాయిలో ప్రొటీయోలిటిక్ ఎంజైమ్‌లు అధిక మోతాదులో లభిస్తాయి. ఇవి ప్రోటీన్‌లను జీర్ణం చేయడానికి ఎంతగానో సహాయపడుతుంది. దీని కారణంగా గ్యాస్ట్రిక్ నుంచి కూడా విముక్తి కలుగుతుంది.