Best Gemstones: ఉద్యోగ, వ్యాపారంలో అభివృద్ధికి ఏ రత్నాలు ధరిస్తే మంచిది

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం  9 రత్నాలు, 84 ఉప రత్నాలున్నాయి. ప్రతి రత్నానికి వేర్వేరు గ్రహాలతో ప్రత్యేక సంబంధముంది. కొన్ని రకాల రత్నాలు ధరిస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయి. మరికొన్ని రత్నాల ప్రభావంతో శుభప్రదమవుతుంది. ఏ ఐదు రత్నాలు ధరిస్తే..ఉద్యోగ, వ్యాపారాల్లో వృద్ధి సాధిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం...

  • Apr 14, 2022, 11:17 AM IST

Ideal Gemstones to Wear: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం  9 రత్నాలు, 84 ఉప రత్నాలున్నాయి. ప్రతి రత్నానికి వేర్వేరు గ్రహాలతో ప్రత్యేక సంబంధముంది. కొన్ని రకాల రత్నాలు ధరిస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయి. మరికొన్ని రత్నాల ప్రభావంతో శుభప్రదమవుతుంది. ఏ ఐదు రత్నాలు ధరిస్తే..ఉద్యోగ, వ్యాపారాల్లో వృద్ధి సాధిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం...

1 /5

Zed Stone వ్యాపారంలో అభివృద్ధికి పచ్చని జెడ్‌స్టోన్ ధరించడం మంచదని భావిస్తారు. ఒకవేళ ఎవరైనా కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకుంటే..జెడ్‌స్టోన్ తప్పకుండా ధరించాలి. వాస్తవానికి ఈ రత్నాన్ని ధరిస్తే..ఏకాగ్రత పెరుగుతుందట. ఆర్ధికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి.

2 /5

Tiger Stone ఈ రత్నాన్ని అన్నింటికంటే ఎక్కువ శక్తివంతమైందిగా పిలుస్తారు. ఇందులో పుసుపు చారలు ఉంటాయి. ఇవి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. దాంతోపాటు విజయం చేకూర్చేందుకు దోహదపడతాయి. ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడతాయి.

3 /5

Blue Saphire Gemstone-నీలం నీలం రాయి శని గ్రహానికి సంబంధించింది. ఈ రత్నాన్ని ప్రతి ఒక్కరూ ధరించలేరు. ఈ రత్నం ప్రభావంతో ఐశ్వర్యం, డబ్బు విషయాల్లో వృద్ధి ఉంటుంది. నీలం రాయి కారణంగా ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధి కన్పిస్తుంది.

4 /5

Golden Topaz అకారణంగా ఆర్ధిక ఇబ్బందులు తలెత్తితే..ఈ రత్నాన్ని ధరించడం మంచిదని చెబుతారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ రత్నం ధరిస్తే మంచిరోజులు ప్రారంభమవుతాయి.

5 /5

Emerald-పచ్చ పచ్చ అనేది బుధగ్రహానికి చెందిన రత్నం. దీన్ని ధరిస్తే బుద్ధి వికసిస్తుంది. దాంతోపాటు ప్రతిపనిలో స్థిరత్వం ఉంటుంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఏ ఇంట్లో అయితే పచ్చ ఉంటుందో..అక్కడ ఐశ్వర్యానికి లోటుండదు.