Gold Rate Today: బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇదే మంచి ఛాన్స్ అని చెప్పవచ్చు. గత మూడు రోజులుగా భారీగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. అయితే వెండి మాత్రం ఇవాళ కాస్త పెరిగింది. ఈ క్రమంలో జనవరి 8వ తేదీ బుధవారం నాడు బంగారం ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం.
Gold Rate Today: దేశంలో బంగారం ధరలు మళ్ళీ తగ్గుముఖం పడుతున్నాయి. పెళ్లిళ్లు,శుభకార్యాలు, పండగలు, అనగా ముందుగానే మనకు గుర్తుకు వచ్చేది బంగారమే. అయితే మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలలో బంగారం వెండికి మంచి బంధం ఏర్పడింది. వందల ఏళ్ల నుంచి బంగారు ఆభరణాలు ధరించడం భారతీయ జీవన విధానంలో ఒక భాగంగా కొనసాగుతూ వస్తుంది.
మహిళలతో పాటు పురుషులు కూడా నగలు ధరిస్తున్నారు. ఇన్వెస్టర్లు కూడా పెట్టుబడి పెట్టేందుకు చాలా మంది బంగారాన్ని మంచి మార్గంగా ఎంచుకుంటున్నారు. దీంతో బంగారం ధరలు రికార్డు స్థాయిలకు చేరుకుంటున్నాయి. వెండికి కూడా ఫుల్ డిమాండ్ ఏర్పడుతుంది. అయితే ఈ మధ్యకాలంలో వెండి ఆభరణాలకు డిమాండ్ భారీగా పెరిగింది.
అందుకే గోల్డ్, సిల్వర్ ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటున్నాయి. 2025 ప్రారంభం తర్వాత తగ్గిన బంగారం ధరలు.. ఆ మరుసటి రోజు నుంచి స్థిరంగా కొనసాగుతున్నాయి. మళ్లీ పెరగకముందే బంగారం కొనడానికి ఇదే మంచి ఛాన్స్ చెప్పవచ్చు. కాగా నేడు బుధవారం దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరిగాయి. క్రితం రోజుతో పోలిస్తే పసిడి ధరలు ఎక్కువగా పెరిగాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ఔన్సుకు రేటు 26 48 డాలర్లకు చేరింది. ఇక స్పాట్ సిల్వర్ రేట్ ఔన్సుకు 30 డాలర్లకు చేరుకుంది. స్పాట్ రూపాయి మారకం విలువ మరింత దిగజారింది. డాలర్ తో పోలిస్తే గ్లోబల్ మార్కెట్లో 85.815 దగ్గర ట్రేడ్ అవుతుంది.
కాగా హైదరాబాద్ మార్కెట్లో వరుసగా మూడో రోజు బంగారం ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. నేడు 22 క్యారెట్ల బంగారం ధర స్థిరంగా 72,150 వద్ద ఉంది.
24 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు,78,710 కొనసాగుతుంది. ఢిల్లీ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 72,300 వద్ద ట్రేడ్ అవుతోంది 24 క్యారెట్ల బంగారం ధర 78860 ట్రేడ్ అవుతుంది.
ఇక వెండి ధరలు చూస్తే హైదరాబాద్ మార్కెట్లో లక్ష మార్కు తాకింది. నేడు కిలో వెండి వెయ్యి రూపాయలు పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి రేటు హైదరాబాద్ మార్కెట్లో లక్ష వద్ద ట్రేడింగ్ అవుతుంది.
ఇక ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి రేటు ₹1000 పెరిగి 92,500 కొనసాగుతోంది. బంగారం వెండి ధరలు పెరగడానికి అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల కారణమని చెప్పవచ్చు.
ఈనెల 20వ తేదీన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవికి చేపట్టనున్నాడు. ఈనేపథ్యంలో బంగారం ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని గ్లోబల్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే భవిష్యత్తులో బంగారు ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు .