Gold Rate: పడిపోతున్న పసిడి మెరుపులు.ఎంత తగ్గిందో తెలిస్తే..కొనకుండా ఉండలేరు

 Gold Rate Today: పసిడి ప్రియులకు ఇది నిజంగా శుభవార్తే. ఎందుకంటే బంగారం ధరలు తగ్గుతున్నాయి. పసిడి మెరుపుల వన్నే తగ్గుతోంది. గత వారం పదిహేను రోజుల నుంచి బంగారం భారీగా తగ్గుతూ వస్తోంది. గత నెల 81వేలు దాటిన బంగారం ధర ఇప్పుడు 6,100 తగ్గడం గమనార్హం. వరుసగా తగ్గుతున్న బంగారం ధరలను చూసి పసిడి ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 
 

1 /8

 Gold Rate Today: స్టాక్ మార్కెట్టే కాదు..బులియన్ మార్కెట్ కూడా ప్రస్తుతం కరెక్షన్ లో కొనసాగుతోంది. గత నెల రేసు గుర్రంలా పరుగెత్తిన బంగారం ధర ప్రస్తుతం నేల చూపులు చూస్తోంది.

2 /8

హైదరాబాద్ మార్కెట్లో గత అక్టోబర్ నెల 30వ తేదీన 10 గ్రాముల బంగారం ధర రికార్డు స్థాయిలో రూ. 81,800 చేరింది. దీంతో భవిష్యత్తులో బంగారం కొనలేమని పసిడి ప్రియులు ఆందోళన చెందారు. ఈ క్రమంలోనే బంగారం ధర తగ్గుతూ వస్తోంది. 

3 /8

అంతేకాదు డిసెంబర్ నాటికి 10 గ్రాముల బంగారం ధర రూ లక్ష రూపాయలకు చేరుతుందన్న అంచనాలు కూడా వినిపించాయి. అయితే అమెరికా అధ్యక్ష ఎన్నికల రిజల్ట్స్ తో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. ప్రస్తుతం పది గ్రాముల స్వచ్చమైన బంగారం రూ. 75, 650కి దిగివచ్చింది. కేవలం 17రోజుల్లోనే పది గ్రాముల మేలిమి బంగారం ధర రూ. 6,150 తగ్గింది. 

4 /8

అక్టోబర్ లో జీవిత కాల గరిష్టస్థాయికి చేరింది బంగారం ధర. దీంతో చాలా మంది బంగారం కొనాలన ఆలోచన పక్కన పెట్టారు. దీంతో ఈ ఏడాది ధన త్రయోదశి కూడా బులియన్ మార్కెట్ కు అంతగా కలిసి రాలేదు.

5 /8

పెళ్లిళ్ల సీజన్ లో బంగారం ధర తగ్గుముఖం పట్టడంతో కొనుగోళ్లు మళ్లీ ఊపందుకున్నట్లు మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ధర తగ్గడంతో మెట్రో నగరాలతోపాటు చిన్న చిన్న నగరాలు, పట్టణాల్లోని నగల దుకాణాలకూ ప్రస్తుతం రద్దీ పెరిగింది. 

6 /8

మరోవైపు పసిడి ధర తగ్గడంతో పెళ్లిళ్ల కోసం చేసే నగల బడ్జెట్ తగ్గిందని వధూవరుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు నగల వ్యాపారులూ కొనుగోలుదార్లను ఆకర్షించేందుకు ఆకర్షణీయమైన ఆఫర్లను కూడా ప్రకటిస్తున్నారు.   

7 /8

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికవడంతో బులియన్ మార్కెట్ సీన్ మొత్తం మారింది. అక్టోబర్ లో ఔన్స్ బంగారం రికార్డు స్థాయిలో 2,790డాలర్లు పలికింది. ప్రస్తుతం 2,570 డాలర్లకు దిగివచ్చింది.

8 /8

గత 15రోజుల్లోనే ఔన్స్ బంగారం ధర 220 డాలర్లు పడిపోయింది. డిసెంబర్ నాటికి  ఔన్స్ బంగారం ధర మరో 60 డాలర్ల వరకు దిగివచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో బంగారం ధర భవిష్యత్తులో మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.