Jio vs BSNL Which Is Best?: టెలికం కంపెనీల మధ్య పోటీ విపరీతంగా పెరిగింది. రిలయన్స్ దిగ్గజ కంపెనీ జియో ఎప్పటికప్పుడు ఆఫర్లు ప్రకటిస్తోంది. మరోవైపు బిఎస్ఎన్ఎల్ కూడా దూకుడుగా కొత్త ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకుతుంది. ఈ రెండిటిలో 70 రోజుల వాలిడిటీతో ఏ ప్లాన్ బెట్టారో తెలుసుకుందాం.
అయితే పెరిగిన టెలికాం తరాల తర్వాత బిఎస్ఎన్ఎల్ కు చాలా మంది పోర్ట్ అయ్యారు. దేశవ్యాప్తంగా 4g సేవలు త్వరలో అందిస్తామన్న బీఎస్ఎన్ఎల్, వచ్చే ఏడాది 5జి సేవలను కూడా ప్రారంభిస్తామని హామీ వ్యక్తం చేసింది
జియో 70 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ ధరలు.. రిలయన్స్ దిగ్గజ కంపెనీ జియో 70 రోజుల వ్యాలిడిటీని రూ.650 అందిస్తుంది. ఇందులో అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ తో పాటు 100 ఎస్ఎంఎస్ లు ఫ్రీ. 105 జీబీ అంటే డైలీ 1.5జిబి ఉచితంగా పొందుతారు.
ఈ జియో రీఛార్జ్ ఆఫర్లతో పాటు జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్ ఉచితంగా యాక్సెస్ చేసే సౌకర్యం కూడా కలదు. ఈ రీఛార్జ్ ప్లాన్ తో పాటు ఉచిత ఎంటర్టైన్మెంట్ కూడా పొందవచ్చు.
ప్రభుత్వ రంగ దిగ్గజ కంపెనీ బిఎస్ఎన్ఎల్ 70 రోజుల వాలిడిటీ ప్లాన్ ధరలు రూ.197 మాత్రమే.. ఈ ప్లాన్ లో బిఎస్ఎన్ఎల్ బడ్జెట్ ఫ్రెండ్లీలో అందిస్తుంది రూ.190 అన్లిమిటెడ్ ఉచిత కాలింగ్ మొదట 18 రోజులు పొందుతారు అలాగే రెండు జిబి డేటా కూడా ఉచితం 100 ఫ్రీ ఎస్ఎంఎస్లు పొందుతారు.
ఆ తర్వాత 52 రోజులపాటు బేసిక్ కాలింగ్ విధానం అందుబాటులో ఉంటుంది. ఎవరికైతే సెకండ్ సిమ్ యాక్టివ్ గా ఉండాలి అనుకుంటారు వారికి ఈ ప్లాన్ బెట్టర్.