Gold Rate Update 25 June 2021: బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మరోసారి దిగొచ్చాయి. మరోవైపు వెండి ధరలు మిశ్రమంగా ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది, ఢిల్లీలోనూ అదే పరిస్థితి నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర స్వల్పంగా పుంజుకోగా, దేశ రాజధానిలో మరోసారి ధర క్షీణించింది.

Gold Price In Hyderabad: కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గినా బులియన్ మార్కెట్లో కలిసిరావడం లేదు. విజయవాడ, హైదరాబాద్ మార్కెట్లలో స్వచ్ఛమైన బంగారంపై రూ.110 మేర దిగిరావడంతో 10 గ్రాముల బంగారం ధర రూ.48,000కి పతనమైంది. తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.44,000కు క్షీణించింది.
ఢిల్లీ మార్కెట్లోనూ పసిడి ధరలపై కరోనా సెకండ్ వేవ్ ప్రభావం కొనసాగుతోంది. తాజాగా ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారంపై రూ.100 మేర తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.50,240కి దిగొచ్చింది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,150 వద్ద మార్కెట్ అవుతోంది.
ఢిల్లీలో బంగారం ధర స్వల్పంగా తగ్గగా, వెండి సైతం అదే దారిలో పయనిస్తోంది. ఢిల్లీలో తాజాగా రూ.200 మేర ధర తగ్గడంతో 1 కేజీ వెండి రూ.67,700కు పతనమైంది. తెలుగు రాష్ట్రాల్లో వెండి మరోసారి పుంజుకుంది. ఏపీ, తెలంగాణ మార్కెట్లలో రూ.300 మేర స్వల్పంగా పెరగడంతో నేడు 1 కేజీ వెండి ధర రూ.73,400కు చేరుకుంది.