Gold Rate: ధన త్రయోదశి సందర్బంగా ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. అక్టోబర్ 29 మంగళవారం పసిడి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 80,900పలుకుతోంది. 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 73,950రూపాయలు ఉంది. నిన్నటితో పోల్చితే నేడు బంగారం ధర తులంపై 400 రూపాయలు తగ్గింది.
Gold Rate: బంగారం ధర గడచిన నెల రోజులుగా రికార్డు స్థాయిలో పెరుగుతోంది. ఈ రేంజ్ నుంచి బంగారం ధర ఎంతవరకు పెరుగుతుందో నిపుణులు సైతం అంచనా వేయలేకపోతున్నారు. దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులే అని విశ్లేషకులు చెప్తున్నారు .
ప్రధానంగా బంగారం ధర పెరగడానికి అమెరికాలోని అధ్యక్ష ఎన్నికలే ప్రధాన కారణంగా చెబుతున్నారు. ప్రస్తుతం అమెరికా అధ్యక్షునికల్లో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. దీంతో మార్కెట్లు ఊగిసలాడుతున్నాయి. ఫలితంగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను సేఫ్గా భావించే బంగారం వైపు తరలిస్తున్నారు. బంగారం ధరలు పెరగడానికి మరో ప్రధాన కారణం ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య కొనసాగుతున్న యుద్ధ వాతావరణం కూడా ఒక కారణంగా చెప్తున్నారు.
బంగారం ధరలు ప్రస్తుతం ఆల్ టైం రికార్డ్ స్థాయి వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఇక్కడి నుంచి పసిడి ధర ఈ ఏడాది చివరి నాటికి 90 వేల రూపాయల వరకు పెరిగే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. అయితే ఈ రేంజ్ నుంచి బంగారం ధరలు స్వల్పంగా తగ్గే అవకాశం కూడా ఉందని కూడా చెప్తున్నారు.
ఎందుకంటే ఇప్పటివరకు బంగారం ధర ఆల్ టైం రికార్డ్ స్థాయిని తాకింది. ఇక్కడి నుంచి ఇన్వెస్టర్లు కొద్దిగా లాభాలను స్వీకరించే అవకాశం ఉందని తద్వారా బంగారం ధరలు దిగివచ్చే అవకాశం ఉందని కూడా అంచనాలు వస్తున్నాయి.
అయితే ఏది అయినప్పటికీ ఇన్వెస్టర్లు ప్రస్తుతం బంగారాన్ని ఒక సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్న నేపథ్యంలో వరుసగా ధరలు పెరగడం అనేది ఆభరణాల కొనుగోలు చేసే వారికి ఒక రకంగా షాక్ అనే చెప్పవచ్చు. మరోవైపు ఎవరైతే బంగారం లో పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నారో అలాంటి వారికి మాత్రం ప్రస్తుతం బంగారం కొనసాగిస్తున్న ఈ డ్రీమ్ రన్ ఒక రకంగా కలిసి వస్తుందని చెప్పాలి.
గడచిన ఐదు సంవత్సరాలుగా చూసినట్లయితే.. బంగారం ధర దాదాపు రెట్టింపు కన్నా ఎక్కువ లాభాన్ని అందించింది. ఈ నేపథ్యంలో మీరు బంగారంలో పెట్టుబడి పెట్టాలి అనుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం జారీ చేసే గోల్డ్ బాండ్లలో పెట్టుబడి పెట్టినట్లయితే మీకు మీ పెట్టుబడి పైన మంచి ఆదాయం లభించే అవకాశం ఉంటుంది.
ఈ గోల్డ్ బాండ్ల పైన కేంద్ర ప్రభుత్వం వడ్డీ కూడా చెల్లిస్తోంది. అదే ఫిజికల్ బంగారం కొనుగోలు చేసినట్లయితే మీరు పెద్ద మొత్తంలో లాభం పొందకపోవచ్చు. ఎందుకంటే వీటి పైన వేస్టేజ్ మజూరి వంటి చార్జీలు వసూలు చేస్తారు.