Gold vs Bitcoin: బంగారం వర్సెస్ బిట్ కాయిన్..ఎందులో పెట్టుబడి పెడితే భారీ లాభాలను పొందవచ్చు?

 Gold vs Bitcoin: అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ విజయం తర్వాత, బిట్‌కాయిన్‌లో భారీ పెరుగుదల కనిపించింది. ఇది గత ఏడాదిలో దాదాపు 150 శాతం మల్టీబ్యాగర్ రాబడిని ఇచ్చింది. అదే సమయంలో ఈ ఏడాది బంగారం కూడా భారీగా పెరిగింది. ఇది ఒక సంవత్సరంలో దాదాపు 25 శాతం స్థిరమైన రాబడిని ఇచ్చింది. బంగారం వర్సెస్  బిట్‌కాయిన్..ఈ రెండింటిలో ఎందులో పెట్టుబడి పెడితే మంచి లాభాలను పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. 
 

1 /7

Gold vs Bitcoin: క్రిప్టో కరెన్సీలు ప్రతిరోజూ లాభాల్లోనే కొనసాగుతున్నాయి. ఆకాశమే హద్దుగా క్రిప్టో కరెన్సీలో భాగమైన బిట్ కాయిన్ సరికొత్త  రికార్డులను క్రియేట్ చేస్తోంది. ప్రస్తుతం బిట్ కాయిన్ 95 వేల డాలర్ల మార్కును దాటేసింది. అంటే సుమారు 80లక్షల రూపాయలు దాటింది. ఈ స్థాయిలో క్రిప్టో కరెన్సీ పెరగడం ఇదే మొదటిసారి. అటు బంగారం ధర కూడా భారీ స్థాయిలోనే పెరుగుతుంది.

2 /7

బంగారాన్ని ప్రపంచంలోనే పురాతన వస్తువుగా పరిగణిస్తారు. ప్రపంచంలోని ఏ ప్రాంతంలోనైనా సరే బంగారంపై లావాదేవీలు జరపవచ్చు. అదే సమయంల బిట్ కాయిన్ కు కొత్త యుగం డిజిటల్ కరెన్సీ అనేక క్యాఫ్షన్ ఇచ్చింది. ఈ మధ్య కాలంలో బిట్ కాయిన్, బంగారం ఈ రెండూ కూడా అద్భుతమైన రాబడిని ఇస్తున్నాయి. పెట్టుబడి, రాబడి ఇచ్చేందుకు ఈ రెండింటిలో ఏది మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.   

3 /7

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం తర్వాత, ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్‌లో తుఫాను వేగం పుంజుకుంది. తొలిసారిగా 94 వేల డాలర్ల స్థాయికి చేరుకుంది. గత ఒక నెల బిట్‌కాయిన్ 35 శాతం రాబడిని ఇచ్చింది. అదే సమయంలో, పెట్టుబడిదారులు ఒక సంవత్సరంలో 146 శాతం కంటే ఎక్కువ మల్టీబ్యాగర్ రాబడిని పొందారు. ప్రస్తుతం బిట్‌కాయిన్ 92,530 డాలర్ల స్థాయిలో ఉంది.  

4 /7

బంగారం గురించి చెప్పాలంటే..భారీగా పెరుగుతూ వస్తోంది. ఏడాది క్రితం 10 గ్రాముల బంగారం ధర రూ.62,650 ఉండగా, ప్రస్తుతం 10 గ్రాములకు రూ.78,080కి చేరుకుంది. దీని ప్రకారం, బంగారం ఒక సంవత్సరంలో దాదాపు 25 శాతం రాబడిని ఇచ్చింది. ఇటీవల బంగారం కూడా దాదాపు రూ.82 వేలకు చేరి ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయికి చేరుకుంది. అంటే గత కొద్ది రోజులుగా బంగారం ధర దాదాపు రూ.5 వేలు తగ్గింది.  

5 /7

బంగారం అనేది పాతకాలం ఆస్తి . ఇది ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన పెట్టుబడిగా పరిగణిస్తారు. అదే సమయంలో, బిట్‌కాయిన్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆస్తి. తాజాగా మార్కెట్ క్యాప్ పరంగా వెండిని అధిగమించి ఏడో స్థానానికి చేరుకుంది. వాస్తవానికి, ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత అమెరికాను క్రిప్టో రాజధానిగా మారుస్తానని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. బిట్‌కాయిన్‌ల ధరలు భారీగా పెరగడానికి ఇదే కారణం.  

6 /7

ట్రంప్ విజయం తర్వాత, డాలర్ బలపడటం, బాండ్ ఈల్డ్స్ కూడా పెరిగినందున బంగారం ధర తగ్గింది. కానీ, ప్రపంచ అస్థిరత కారణంగా బంగారం ధర మళ్లీ పెరగుతోంది. ముఖ్యంగా, రష్యాపై ఉక్రెయిన్ దాడి ఉద్రిక్తతలను పెంచింది.  రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా అణు దాడిని బెదిరించారు. ప్రఖ్యాత రేటింగ్ ఏజెన్సీ గోల్డ్‌మన్ శాక్స్ కూడా బంగారం ధర మరింత పెరగవచ్చని అంచనా వేసింది. పెట్టుబడి పెట్టడానికి ఇది సురక్షితమైన మార్గం. మధ్యస్థం నుండి దీర్ఘకాలికంగా మీకు స్థిరమైన రాబడిని అందిస్తుంది.   

7 /7

అయితే బిట్  కాయిన్ గురించి తెలుసుకున్నట్లయితే ..భారత్ లో దీనికి సంబంధించి నిర్దిష్ట నియమాలు మరియు నిబంధనలు లేవు. ట్రంప్ విజయం తర్వాత కూడా బిట్‌కాయిన్ ధరలు పెరుగుతూనే ఉండవచ్చు, కానీ ప్రస్తుతం దీనిని భారతదేశంలో సురక్షితమైన పెట్టుబడి అని చెప్పలేము. క్రిప్టోకరెన్సీ ద్వారా వచ్చే లాభాలపై 30 శాతం భారీ పన్ను ఉంది. క్రిప్టో బదిలీపై 1 శాతం TDS కూడా ఉంది. ఇక్కడ క్రిప్టోకు సంబంధించి ప్రత్యేక భద్రతా ఫీచర్ ఏదీ లేదు. అటువంటి పరిస్థితిలో, మీ రిస్క్ తీసుకునే సామర్థ్యం ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే బిట్‌కాయిన్ లేదా క్రిప్టోకరెన్సీలో పెట్టుబడి పెట్టడం మంచిది.