EPS-95 : EPFO : EPS-95 పెన్షన్ దారులకు అదిరిపోయే వార్త..అతి త్వరలో కనీస పెన్షన్ రూ. 7500 పెరిగే ఛాన్స్?

EPS-95 : కేంద్రంలోని మోదీ సర్కార్ ఈపీఎస్ 95 పెన్షన్ దారులకు త్వరలోనే శుభవార్త వినిపించే అవకాశం ఉంది. ఈపీఎస్ పెన్షన్ దారుల హయ్యర్ పెన్షన్ విషయంలో కేంద్ర సర్కార్ త్వరలోనే కీలక నిర్ణయం తీసుకుంటారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే ఈపీఎస్ 95 పెన్షన్ దారులు పెద్దెత్తున ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. 2022 ఏడాది నవంబర్ లో సుప్రీంకోర్టు కూడా హయ్యర్ పెన్షన్ అమలు చేయాలని తీర్పు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అతి త్వరలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంటుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. 
 

1 /8

EPS-95 : చాలా కాలం తర్వాత ఈపీఎస్ 95 పెన్షనర్స్ డిమాండ్ అయిన హయ్యర్ పెన్షన్ విషయంలో త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పేందుకు కేంద్రంలోని మోదీ సర్కార్ సిద్ధమౌతున్నట్లు సమాచారం. ఇదెలా ఉంటే ఈపీఎస్ 95 పెన్షన్ దారులు సుదీర్ఘకాలంగా తమ పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు. మినిమం పెన్షన్ కోసం పోరాటంలో భాగంగా 2022 నవంబర్ లో ఈపీఎస్ 95 పెన్షన్ దారులకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆ తీర్పు వచ్చి ఇప్పటికీ రెండేళ్లు పూర్తయ్యింది. అయినా కేంద్ర ఇప్పటికీ ఇంకా చర్యలు తీసుకోకపోవడంపై పెన్షన్ దారుల్లో అసంత్రుప్తి నెలకొంది.   

2 /8

ఇప్పటికే వేలాది కుటుంబాలు అతి తక్కువ పెన్షన్ పొందుతున్న నేపథ్యంలో వైద్య ఖర్చులు పెరుగుతున్నా ద్రవ్యోల్బణం కారణంగా పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ, ఏపీలో వేలాది మంది ఉద్యోగులు ఈపీఎస్ 95స్కీం ద్వారా కేవలం వెయ్యి నుంచి 15వందల రూపాయలు మాత్రమే పెన్షన్ ద్వారా పొందుతున్నారు.   

3 /8

అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పెన్షన్ స్కీముల్లో వయో వ్రుద్ధులకు తెలంగాణలో 2వేలు, ఏపీలో 4వేలు లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ తమకు సామాజిక భద్రత వ్రుద్ధాప్య పింఛన్ల కంటే తక్కువ పెన్షన్ ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. 

4 /8

తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఆర్టీసీ, రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్ రిటైర్డ్ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో రిటైర్ అయిన ఉద్యోగులు ఇలా వేలాది మంది అతి తక్కువ పెన్షన్ కాలంతో నెగ్గుకువస్తున్నారు. 

5 /8

దేశవ్యాప్తంగా ఉన్న 35లక్షల మంది, ఈపీఎస్ 95స్కీం  పెన్షన్ దారులకు కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే పెన్షన్ లభిస్తుంది. హయ్యర్ పెన్షన్ అమలు చేస్తే కనీస పెన్షన్ రూ. 7500 అవుతుందని తద్వారా కాస్త ఉపశమనం లభిస్తుందని అంటున్నారు. 

6 /8

ఇదెలా ఉంటే గడిచిన పదేళ్లుగా కనీస పెన్షన్ 9000 రూపాయలు ఇవ్వాలని అఖిల భారత స్ధాయిలో పెన్షన్ సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. ఈపీఎస్ 95 పెన్షనర్స్ పథకం అర్హులుగా 78లక్షల మంది పెన్షనర్లు ఉన్నారు.   

7 /8

అయితే గతంలో ఈపీఎస్ 95 పెన్షన్ సంఘం కేంద్రంలోని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ను కలిశారు. తమ డిమాండ్లను వారి ద్రుష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సీతారామన్ ప్రభుత్వం సానుభూతితో వ్యవహరించి సమస్యకు పరిష్కారం చూపుతుందని హామీ ఇచ్చారు.   

8 /8

ఈ నేపథ్యంలో ఈపీఎస్ 95 హయ్యర్ పెన్షన్ పై ఇప్పటికే ఆప్షన్స్ అందుకోగా దీనిపై త్వరలోనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం.