Budget 2025: మహిళలకు భారీ శుభవార్త.. ఫిబ్రవరి 1న కీలక ప్రకటన చేయనున్న ప్రభుత్వం

Budget 2025: ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్లో మహిళల కోసం అనేక ప్రకటనలు చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి మహిళ సమ్మాన్ సేవింగ్  సర్టిఫికెట్ స్కీం పొడిగింపును ప్రకటించే ఛాన్స్ ఉంది. ఈ పథకం ఈ ఏడాది మార్చితో ముగియనుంది. దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.
 

1 /6

Budget 2025: కేంద్ర బడ్జెట్ 2025ను వచ్చే ఫిబ్రవరి ఒకటవ తేదీన సమర్పించనున్నారు. బడ్జెట్లో అన్ని వర్గాలను సంతోష పరిచే విధంగా  ప్రభుత్వం ఆకర్షణీయమైన ప్రకటనలు చేస్తుందని ప్రజలు భావిస్తున్నారు. బడ్జెట్లో మహిళల కోసం ప్రత్యేక ప్రకటనలు కూడా ఉండే అవకాశం ఉంది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్లో మహిళ కోసం అనేక ప్రకటనలు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 

2 /6

కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్స్ పొడిగించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ స్కీమ్ ఈ ఏడాది మార్చి తో ముగుస్తుంది.  ప్రభుత్వం ఈ పథకం కాల పరిమితిని పొడిగించకపోతే.. దాని స్థానంలో కొత్త పథకాన్ని ప్రకటించే అవకాశం ఉంది.  దీంతో పాటు మహిళలకు ఆదాయపన్ను రాయితీని కూడా ఈ బడ్జెట్ లో ప్రకటించే అవకాశం ఉంది.  

3 /6

కొన్ని నెల క్రితం ఆదాయపన్నుల్లో మహిళలకు ఇస్తున్న మినహాయింపులను ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. పన్ను నిపుణుల అభిప్రాయం ప్రకారం మహిళలపై ట్యాక్స్ భారాన్ని తగ్గించడానికి ప్రభుత్వం మళ్ళీ ప్రకటించే అవకాశం ఉంది. మహిళలకు ఆదాయం పరిమితిని పెంచే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం కొత్త ఆదాయపు పన్ను విధానంలో ఆదాయపన్ను మినహాయింపు పరిమితి మూడు లక్షల రూపాయల వరకు ఉంది. పాత టాక్స్ పద్ధతిలో ఇది 2.5 లక్షల రూపాయలుగా ఉంది. మగ, ఆడ క్లైంట్స్ కోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మహిళలకు ప్రత్యేక ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని ప్రకటించే అవకాశం ఉంది .

4 /6

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023వ సంవత్సరంలో మహిళ కోసం ప్రత్యేక పొదుపు పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ యోజన అనే ఈ పథకం. ఈ ఏడాది మార్చితో ముగుస్తుంది. ఇది ఒక చిన్న పొదుపు స్కీం. ఈ పొదుపు చేయడానికి మహిళలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. ఈ స్కీములో కనీసం డిపాజిట్ గా లక్ష కాగా గరిష్ట డిపాజిట్ రెండు లక్షలు. ప్రతి మూడు నెలకోసారి వడ్డీ పొందడం ఈ స్కీం ప్రత్యేకత.  

5 /6

 అయితే మహిళలకు ఆదాయ పన్ను మినహాయింపు లిమిట్ పెంచినట్లయితే వారిపై ట్యాక్స్ భారం తగ్గుతుందని పన్ను నిపుణులు అంటున్నారు. దీంతో వారి చేతిలో ఖర్చు చేసేందుకు ఎక్కువ డబ్బు ఉంటుంది. మహిళలు ఎక్కువ ఖర్చు చేయడం వల్ల వినియోగం కూడా పెరుగుతుంది. ఆర్థిక అభివృద్ధిపై కూడా సానుకూల ప్రభావం చూపుతుంది. దీంతో ఆదాయపన్ను భారాన్ని తగ్గించుకోవాలని పన్ను నిపుణులు ప్రభుత్వానికి సూచించారు.  

6 /6

2024 కేంద్ర బడ్జెట్లో మహిళలు, బాలికలకు సంబంధించి స్కీమ్స్ కోసం ప్రభుత్వం మూడు లక్షల కోట్ల రూపాయలు కేటాయించింది. మహిళా సాధికారతపై ప్రభుత్వం ఫోకస్ పెట్టిందనడానికి ఇది నిదర్శనం అని చెప్పవచ్చు. ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్.. గత ఏడాది బడ్జెట్లో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ను ఏర్పాట్లు చేస్తామని ప్రకటించారు. ఇళ్లకు దూరంగా నగరాలలో పనిచేసేందుకు వచ్చిన మహిళలకు సౌకర్యాలు పెంచడమే దీని లక్ష్యం.  అయితే అలాంటి మహిళలు బస చేయడానికి సురక్షితమైన స్థలానికి కనుగొనడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు .