Hanuman Jayanti 2024: చైత్ర మాసంలో పూర్ణిమ తిథినాడు హనుమంతుడు జన్మించాడని చెబుతుంటారు. ఈ రోజున బ్రాహ్మీమూర్తంలో నిద్రలేచీ, స్నానంచేసి హనుమంతుడిని ప్రత్యేకంగా పూజించాలని పండితులు సూచిస్తుంటారు. ముఖ్యంగా హనుమంతుడికి కొన్నిరకాల పదార్థాలు అంటే ఎంతో ఇష్టమంట.
హనుమంతుడికి ముఖ్యండి వడపప్పు అంటే ఇష్టమని చెబుతుంటారు. అందుకు ఏ గుడిలో చూసిన కూడా హనుమాన్ జయంతి రోజున లేదా వడమాలను వేస్తుంటారు. వడమాలను పదకొండు,ఇరవై ఒకటి ఇలా తమ శక్తి కొలది భక్తుల చేసుకుని ఆంజనేయ స్వామివారికి సమర్పిస్తారు. దీంతో మన మనస్సులోని కోరికలు నెరవేరుతాయని చెబుతుంటారు.
అంజనా, కేసరి నందనుడికి బేసన్ లడ్డులంటే కూడా ఎంతో ఇష్టమని చెబుతారు. అందుకే చాలా మంది బేసన్ లడ్డులను నైవేద్యంగా సమర్పిస్తారు. కొందరు ఇంట్లోనే లడ్డులను చేసి, స్వామివారికి సమర్పిస్తారు.జీవితంలో ఏపనులు చేసిన కూడాకొందరికి అస్సలు కలిసి రాదు. అలాంటి వారు బేసన్ ను నైవేద్యంగా పెడితే, శుభయోగాలు కల్గుతాయని చెబుతుంటారు.
రామయ్య ప్రియమైన భక్తుడికి కొబ్బరికాయ, బెల్లం ప్రసాదం అంటే కూడా ఎంతో ఇష్టమంట. అందుకు మన ఇంట్లో ఏ పండుగకైన చాలా మంది తప్పనిసరగా కొబ్బరికాయ, బెల్లంలను నైవేద్యంగా సమర్పిస్తారు. కొబ్బరికాయ, బెల్లంతినడం వల్ల పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే హనుమంతుడికి ప్రత్యేకంగా బెల్లం, కొబ్బరిసమర్పిస్తారు.
హనుమంతుడికి పులిహోర ప్రసాదం అంటే కూడా ఎంతో ఇష్టమంట. అందుకు హనుమాన్ జయంతి రోజున పులిహోర సమర్పిస్తే కూడా ఆ భజరంగ భలీ అనుగ్రహాం మనకు తప్పకుండా ఉంటుది. శనిదేవుడికి కూడా పులిహోర అంటే ఇష్టమంట. ఉత్సవాలు, ఇంట్లో వ్రతాలు జరిగినప్పుడు తప్పకుండా పులిహోర చేయాలని చెబుతుంటారు. శనిదేవుడు మన ఇంటికి వచ్చి పులిహోర స్వీకరించి, ఆయన వెళ్లిపోయేటప్పుడు దోషాలు కూడా వెళ్లిపోతాయంట.
రాముడి భక్తుడికి తమలపాకులు అంటే ఎంతో ఇష్టమంట. ఒకసారి సీతమ్మ, రామయ్యలు తమలపాకులు తిన్నారంట. అప్పుడు సీతమ్మ నాలుక ఎర్రగా మారింది. హనుమంతుడు దీనికి కారణం అడిగారంట. రామయ్య అంటే నాకు ఎంతో ప్రేమ. అందుకే తన నాలుక ఎర్రగా మారిందని చెప్పింది. దీంతో హనుమంతుడు కూడా తనకు కూడా రామయ్య అంటేఎంతో ఇష్టం. అందుకు అనేక తమలపాకులు తిన్నాడంట. అప్పటి నుంచి హనుమంతుడికి తమలపాకులు కూడా అర్పిస్తే మన కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతుంటారు.
ఇక వీటితో పాటు రవ్వ సిర కూడా హనుమంతుడికి ఎంతో ఇష్టమంట. జామకాయలు, పూర్ణంగారెలు, మినపప్పు వడియాలు, మొదలైనవి కూడా సమర్పిస్తే హనుమంతుడు ఎంతో ఆనందపడతారంట. అందుకే హనుమాన్ జయంతి రోజున ఇవి నైవేద్యంగా సమర్పించాలని కూడాఆ చెబుతుంటారు. అందుకే భక్తులంతా ఈరోజు ముఖ్యంగా వడపప్పు, అప్పాలను ఎక్కువగా రామయ్య భక్తుడికి సమర్పిస్తారు.(Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)