Hardik Pandya New Girlfriend Spotted In Ind Vs Pak Match Know Who Is She: భారత అగ్రశ్రేణి ఆటగాడు హార్దిక్ పాండ్యా మరికొరితో ప్రేమాయణం సాగిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా కొత్త గర్ల్‌ఫ్రెండ్ ప్రత్యక్షమైంది. ఆమెతో డేటింగ్ చేస్తున్నాడని.. అందుకే దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆమె ప్రత్యక్షమైందని చర్చ జరుగుతోంది.
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా భారత్, పాకిస్థాన్ మధ్య తొలి మ్యాచ్ జరిగింది. అత్యంత ఉత్కంఠ కలిగిన ఈ మ్యాచ్‌లో కొన్ని ఆసక్తికర సన్నివేశాలు కనిపించాయి. వాటిలో హార్దిక్ పాండ్యా కొత్త ప్రియురాలు కనిపించింది. ఆమె ఫొటో వైరల్‌గా మారింది.
ప్రేమించి పెళ్లి చేసుకున్న నటాషా స్టాంకోవిక్‌కు గతేడాది హార్దిక్ పాండ్యా విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో విడిపోయారు. హార్దిక్ నుంచి ఆమె భారీగా భరణం పొందారనే వార్తలు వైరల్‌గా మారాయి. అయితే ఆమెకు విడాకులు ఇవ్వడం వెనుక ఒకరు ఉన్నారనే వార్తలు వచ్చాయి.
ఒకరితో ప్రేమలో ఉన్నాడని.. ఆమె కారణంగా హార్దిక్ పాండ్యాకు నటాషా విడాకులు ఇచ్చిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌లో ఒక యువతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్టాండ్స్‌లో నిలబడిన ఆమెపైనే కెమెరా కళ్లు పడ్డాయి. ఆమెవరో తెలుసా?
ఛాంపియన్స్ ట్రోఫీలో దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన భారత్, పాక్ మ్యాచ్‌లో ఆమె కనిపించింది. ఆమె హార్దిక్ పాండ్యా కొత్త ప్రియురాలు అని చర్చ జరుగుతోంది. ఆమె పేరు జాస్మిన్ వాలియా. ఆమెవరో తెలుసా?
హార్దిక్ పాండ్యా ప్రేమిస్తున్న జాస్మిన్ బ్రిటన్‌కు చెందిన ప్రముఖ గాయని. ఇంగ్లీష్, పంజాబీ, హిందీ భాషలలో జాస్మిన్ కొన్ని పాటలు పాడారు. 2017లో జాక్ నైట్‌తో కలిసి చేసిన 'బామ్ డిగ్గీ' అనే ఆల్బమ్‌తో విశేష గుర్తింపు పొందింది.
2010లో జాస్మిన్ 'ది ఓన్లీ వే ఈజ్ ఎసెక్స్' అనే రియాలిటీ టీవీ సిరీస్‌లో కనిపించారు. అనంతరం టీవీ పరిశ్రమలో జాస్మిన్ కొనసాగుతున్నారు. 2014 ఫిబ్రవరిలో యూట్యూబ్ ఛానెల్‌ను కూడా ప్రారంభించింది. దమ్ డీ డీ దమ్, గర్ల్ లైక్ మీ, గో డౌన్, బోమ్ డిగ్గీ వంటి పాటలు జాస్మిన్‌కు పాపులారిటీని తీసుకొచ్చాయి.
ప్రస్తుతం నటాషాతో విడాకులు తీసుకున్న భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో జాస్మిన్ ప్రేమలో ఉందని.. వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నట్లు సమాచారం. ఎక్కువ కాలం హార్దిక్ విదేశాల్లో ఉండడానికి కారణం జాస్మిన్ కారణంగా తెలుస్తోంది. మరి జాస్మిన్‌తో కేవలం డేటింగ్ చేస్తాడా? పెళ్లి కూడా చేసుకుంటాడా? అనేది కాలం నిర్ణయిస్తుంది.
కొన్ని సంవత్సరాలుగా హార్దిక్ పాండ్యాకు.. జాస్మిన్‌కు మధ్య మంచి అనుబంధం ఉందని తెలుస్తోంది. గతంలో ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున హార్దిక్ ఆడుతుండగా ఆ మ్యాచ్‌లకు జాస్మిన్ హాజరైంది. అంతేకాకుండా హార్దిక్ పాండ్యా ఆడిన మిగతా మ్యాచ్‌లకు కూడా జాస్మిన్ వచ్చిందని ఆమె ఫొటోలు చూస్తుంటే తెలుస్తోంది.