Winter Vegetables: చలికాలం నడుస్తోంది. దేశంలో చలిగాలులు పెరుగుతున్నాయి. చలికాలం వచ్చిందంటే చాలు వ్యాధుల తీవ్రత పెరిగిపోతోంది. ప్రధాన కారణం శరీరంలో ఇమ్యూనిటీ తగ్గిపోవడమే.
Winter Vegetables: అందుకే చలికాలంలో ఇమ్యూనిటీని పెంచేందుకు డైట్‌లో మార్పులు తప్పకుండా చేయాల్సి ఉంటుంది. చలికాలంలో వచ్చే కూరగాయలు తినడం ద్వారా రోగ నిరోధక శక్తి పెంచుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఐదు రకాల కూరగాయలు తినడం వల్ల ఇమ్యూనిటీని పెంచుకుని వివిధ రకాల వ్యాధుల్ని దూరం చేసుకోవచ్చు.
పాలకూర పాలకూరను పోషక పదార్ధాల ఖజానాగా పిలుస్తారు. పాలకూరలో ఐరన్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. ఎముకల్ని బలోపేతం చేసేందుకు, చర్మం నిగారింపు పెంచేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది.
ముల్లంగి ముల్లంగిలో విటమిన్ సి, ఫైబర్ చాలా ఎక్కువ. ముల్లంగి తినడం వల్ల ఇమ్యూనిటీ పటిష్టమౌతుంది. దాంతో జలుబు, దగ్గు, జ్వరం వంటి వ్యాధులు దూరమౌతాయి. ఫలితంగా గుండె పోటు ముప్పు కూడా తగ్గుతుంది.
కాలిఫ్లవర్ కాలిఫ్లవర్‌లో పెద్దమొత్తంలో విటమిన్ సి, విటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్లు పెద్దమొత్తంలో ఉంటాయి. అందుకే కాలిఫ్లవర్ తినడం వల్ల ఇమ్యూనిటీ పటిష్టం కావడమే కాకుండా ఎముకలు బలంగా మారతాయి.
క్యారట్ క్యారట్‌లో విటమిన్ ఎ చాలా ఎక్కువగా ఉంటుంది. రోజూ క్రమం తప్పకుండా క్యారట్ తినడం వల్ల కళ్లజోడు బాధ తగ్గుతుంది. కంటిచూపు మెరుగుపడుతుంది. ఉదయం వేళ జ్యూస్ రూపంలో తాగితే మంచి ఫలితాలుంటాయి.
చిలకడ దుంప చిలకడ దుంపను స్వీట్ పొటాటో అని పిలుస్తారు. ఇందులో విటమిన్లు, ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటాయి. స్వీట్ పొటాటో తినడం వల్ల కంటి చూపు పెరుగుతుంది.