Havoc flood Pics: నైరుతి రుతుపననాల ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు ఉత్తరాదిని అతలాకుతలం చేస్తున్నాయి. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలే కాకుండా పంజాబ్, ఉత్తరాఖండ్, హర్యానాల్లో కూడా భారీ వర్షాలు విధ్వంసం సృష్టించాయి. పూర్తి వివరాలు మీ కోసం..
Havoc flood Pics: ఉత్తరాదిలో కురుస్తున్న భారీ వర్షాలతో ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు విలవిల్లాడుతున్నాయి. ఈ రెండు రాష్ట్రాలతో పాటు హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు నివాస ప్రాంతాల్ని ముంచెత్తాయి. ఇళ్లు, మార్కెట్లు, వంతెనలు సైతం కొట్టుకుపోతున్న భయానక దృశ్యాల్లో కొన్ని మీ కోసం..
భారీ వర్షాల కారణంగా పంజాబ్‌లో రోడ్లపై పడవలు నడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. డేరా బస్తీలోని ఓ హౌసింగ్ కాలనీలో భారీ వర్షాల కారణంగా వరద నీరు దాదాపు గ్రౌండ్ ఫ్లోర్‌ను ముంచేశాయి. కార్లన్నీ నీళ్లలో తేలుతున్న పరిస్థితి
హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షం సృష్టించిన బీభత్సంతో చాలామంది మృత్యువాత పడ్డారు. మనాలీలో నదిలో కార్లు కొట్టుకుపోయాయి.
హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ జిల్లాలో భారీ వర్షాల కారణంగా బియాస్ నది వరద ఉధృతికి ఓ వంతెన సైతం కొట్టుకుపోయింది.
మనాలీలో భారీ వర్షాల కారణంగా బియాస్ నదిలో కార్లు పెద్దసంఖ్యలో కొట్టుకుపోయాయి.
భారీ వర్షాల కారణంగా హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ జిల్లా తుగాన్‌లో భారీ వరదతో పాటు అడవిలోని కలపంతా కొట్టుకొచ్చేసింది.
భారీ వర్షాల కారణంగా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో రోడ్లపై కార్లు, ద్విచక్రవాహనాలు ఇరుక్కుపోయాయి.
ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో భారీ వర్షాల కారణంగా చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లన్నీ నీళ్లలో నిండిపోయాయి. గురుగ్రామ్‌లో భారీ వర్షాల కారణంగా జలదిగ్భంధనమైన రోడ్డుపై చిక్కుకున్న కారును స్థానికులు బయటకు లాగేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యమిది.