Hero Splendor Plus Specifications |Hero Splendor దేశంలో అత్యధికంగా అమ్మకం జరిగే బైక్ ఇదే. చాలా సమయం నుంచి భారతీయ మోటార్ సైకిల్ మార్కెట్‌లో ఈ బైక్ రారాజుగా ఉంది.
Bike With Good Mileage, Bikes Under 70,000 | దేశంలో అత్యధికంగా అమ్మకం జరిగే బైక్ ఇదే. చాలా సమయం నుంచి భారతీయ మోటార్ సైకిల్ మార్కెట్‌లో ఈ బైక్ రారాజుగా ఉంది. స్ల్పెండర్‌పై ప్రయాణం చేసే వారు మనకు ఎక్కడంటే అక్కడే కనిపిస్తారు. దీంతో పాటు Splendor మరిన్ని ప్రత్యేకతలు తెలియజేస్తాం.
ధర
Hero Splendor Plus మూడు వెరియంట్స్‌లో అందుబాటులో ఉంటుంది. దీని ధర రూ.60,960 నుంచి రూ.64,470 వరకు ఉంటుంది. ఇది ఢిల్లీ ఎక్స్‌షోరూం ధర.
హీరో ఈ వైక్‌లో 97.2 cc ఇంజిన్‌ను అందించారు. ఇది 8hp పవర్‌తో 8.05Nm టార్క్ జెనరేట్ అవుతుంది. ఇందులో 4స్పీడ్ గేర్ బాక్స్ ఉంది.
Splendor Plus లో i3s టెన్నాలజీతో వస్తుంది. దీనిపై కంపెనీ ఏం చెప్పిందంటే ఇది 9 శాతం ఇంధనం సేవ్ చేస్తుంది.
హీరోకి బైక్‌లో ట్యూబ్‌లెస్ టైర్, మెయింటనెన్స్ ఫ్రీ బ్యాటరీ 165mm గ్రౌండ్ క్లియరెన్స్, పొడవైన సీట్, ఇంస్టాంట్ పికప్, ఆల్‌వెదర్ ఈజీ స్టార్ట్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
డైమెన్షన్ విషయానికి వస్తే హీరో స్ల్పెండర్ ప్లస్ పొడవు 2000mm, వెడల్పు 720mm, ఎత్తు 1052mm, వీల్‌బేస్ 1236mm, సీటు హైట్ 785mm గా ఉంది.
బ్రేకింగ్ విషయానికి వస్తే హీరోకు చెందిన ఈ పాప్యులర్ బైక్ ఫ్రంట్ అండ్ రేర్‌లో 130mm డ్రమ్ బ్రేక్ లభిస్తుంది.