Snowfall Pics: ఉత్తరాదిన కొండ ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తోంది. ఆకాశం నుంచి ఏకధాటిగా కురుస్తున్న మంచు చూసేందుకు ఆ మంచులో మునిగితేలేందుకు పర్యాటకులు పోటెత్తుతున్నారు. మంచు కారణంగా కొండ ప్రాంతాలు, చెట్లు చేమలు, ఇళ్లు, రోడ్లు అన్నీ తెల్లటి మంచు దుప్పటి కప్పుకున్నాయి.
హిమాచల్ ప్రదేశ్‌లోని ఎత్తైన హిల్ స్టేషన్లలో మంచు దుప్పటి కప్పుకుంది. హిమాచల్ ప్రదేశ్‌లో ఈ సీజన్‌లో తొలిసారి మంచు కురిసింది. పర్యాటకుల ఆనందానికి హద్దు లేకుండా పోయింది.
షిమ్లా చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రస్తుతం మంచు భారీగా కురుస్తోంది. ఎక్కడ చూసినా మంచే కన్పిస్తోంది.
ఇళ్లు, కొండలు, చెట్లు అన్నీ మంచుతో కప్పుకుపోయాయి. మంచు భారీగా కురుస్తుండటంతో అందాలు మరింత ద్విగుణీకృతమౌతున్నాయి.
ఈ చిత్రం హిమాచల్ ప్రదేశ్ షిమ్లాలోనిది. ఇక్కడ మంచు కారణంగా మొత్తం రోడ్లన్నీ మంంచు దుప్పటి కప్పుుకున్నాయి.
హిమాచల్ ప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాలు మంచుతో నిండిపోతున్నాయి. రోడ్లపై ప్రయాణం కష్టంగా మారిపోయింది. కొన్ని చోట్ల రోడ్లపై 2 అడుగుల మేర మంచు పేరుకుపోయింది.
ఈ చిత్రంలో మంచుతో మొత్తం కప్పుకుపోయిన ప్రాంతాన్ని చూడవచ్చు. హిమాచల్ ప్రదేశ్‌లో ప్రస్తుతం భారీగా మంచు కురుస్తోంది.