Honda Npf 125 Scooter 2025: హోండా నుంచి అద్భుతమైన ఫీచర్స్‌తో NPF 125 స్కూటర్‌ను కస్టమర్స్‌కి పరిచయం చేయబోతోంది. ఇది మోస్ట్ పవర్‌ఫుల్ ఫీచర్స్‌తో లాంచ్ కాబోతోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Honda Npf 125 Scooter 2025: ప్రముఖ జపనీస్ ఆటోమొబైల్ కంపెనీ హోండా మార్కెట్‌లోకి అద్భుతమైన స్కూటర్‌ను పరిచయం చేసింది. అద్భుతమైన కొత్త NPF 125 స్కూటర్ అందుబాటులోకి తీసుకు వచ్చింది. మార్కెట్‌లో విడుదలవుతున్న స్కూటర్స్‌ను దృష్టిలో పెట్టుకుని హోండా కంపెనీ ఈ కొత్త స్కూటర్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్కూటర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ NPF 125 స్కూటర్ మార్కెట్‌లో లాంచ్ అయితే, సుజుకి బర్గ్‌మాన్ స్ట్రీట్ 125, TVS Ntorqలతో పాటు Yamaha Fascino వంటి స్కూటర్స్‌తో పోటీ పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్కూటర్‌లో అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా ఈ హోండా NPF 125 స్కూటర్ డ్యూయల్ హెడ్‌ల్యాంప్ సెటప్‌ను కలిగి ఉండబోతున్నట్లు సమాచారం. అలాగే ప్రీమియం మస్కులర్ బాడీ ప్యానలింగ్‌తో లాంచ్ కానుంది. దీంతో పాటు స్కూటర్‌లో టర్న్ సిగ్నల్స్ కోసం ప్రొజెక్టర్-స్టైల్ హౌసింగ్‌ను అందిస్తోంది.
అలాగే ఈ స్కూటర్‌లో ప్రత్యేకమైన సింగిల్ పీస్ సీట్‌ను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా అప్‌స్వెప్ట్ ఎగ్జాస్ట్, H-ఆకారపు టెయిల్‌లైట్లు కూడా కలిగి ఉండబోతున్నట్లు సమాచారం..ఇక ఈ స్కూటర్‌కి సంబంధించిన సీట్ స్టోరేజ్ వివరాల్లోకి వెళితే.. 14.3-లీటర్‌లకు పైగా స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది.
అంతేకాకుండా ఈ స్కూటర్‌లో వెనుకవైపు టాప్ బాక్స్ కూడా లభిస్తోంది. అలాగే లాంగ్ రైడ్ చేసేందుకు ప్రత్యేకమైన సీట్లను కూడా అందిస్తోంది. ఇక ఈ స్కూటర్‌కి సంబంధించిన ఇంజన్ వివరాల్లోకి వెళితే.. ఇది 124cc సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజన్‌తో అందుబాటులోకి వస్తోంది.
దీంతో పాటు ఈ హోండా NPF 125 స్కూటర్ ఇంజన్ 10Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ మోటర్ సైకిల్ ధర రూ.90,000 పైగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది ప్రత్యేకమైన ESP టెక్నాలజీని కలిగి ఉంటుంది. అలాగే దీని గరిష్ట వేగం గంటకు 90కిమీ పైగానే ఉంటుంది.