Masked Aadhaar card: మాస్క్‌డ్‌ ఆధార్‌ కార్డ్‌ అంటే ఏంటి? ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి?

Download Masked Aadhar card: మీరు ఏదైనా రెస్టారెంట్‌ లేదా ఓయో రూమ్‌ చెక్‌ ఇన్‌ అయినప్పుడు మీ ఒరిజినల్‌ ఆధార్‌ కార్డు ఇస్తారు. చాలామంది ఇదే పనిచేస్తారు. కానీ, ఇది మీ పర్సనల్‌ ఇన్‌ఫర్మేషన్‌ బయటకు వారికి తెలిసిపోతుంది. ఇది ప్రమాదం. అయితే, మాస్క్‌డ్‌ ఆధార్‌ కార్డు ఇవ్వాలి. అసలు మాస్క్‌డ్‌ ఆధార్‌ కార్డు అంటే ఏంటి? ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి? ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం..
 

1 /6

ఎక్కడైనా మీ ఆధార్‌ కార్డు ఇవ్వాల్సి వచ్చినప్పుడు, మీ ఒరిజినల్ కార్డు ఇవ్వాల్సిన అవసరంలేదు. మాస్క్‌డ్‌ ఆధార్‌ కార్డు ఇస్తే సరిపోతుంది. ఒరిజినల్ ధార్‌ కార్డు ఎక్కడంటే అక్కడ ఇస్తే మీ బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు తస్కరించే అవకాశం కూడా ఉంది. అయితే, ఆధార్‌ కార్డ్‌ మాస్క్‌ ఉన్నది ఇస్తే ఎలాంటి నష్టం జరగదు.  

2 /6

మాస్క్‌డ్‌ ఆధార్‌ కార్డ్‌ అంటే ఏమిటి? మాస్క్‌డ్‌ ఆధార్‌ కార్డ్‌ మీ ఒరిజినల్‌ స్టాండర్డ్‌ ఆధార్‌ కార్డుకు ప్రత్యామ్నాయం. ఇందులో ఆధార్ నంబర్‌ చివరి నాలుగు సంఖ్యలు మాత్రమే కనిపిస్తాయి. మిగతావి ఇతరులకు కనిపించవు. కేవలం పేరు, ఫోటో, పుట్టిన తేదీ మాత్రమే కనిపిస్తుంది.

3 /6

ఇలాంటి మాస్క్‌డ్‌ ఆధార్‌ కార్డును ఏవైనా హోటల్స్‌కు వెళ్లినప్పుడు చెక్‌ ఇన్‌ లో ఇస్తే సరిపోతుంది. ట్రైన్‌, ఎయిర్‌పోర్టులో కూడా ఈ ఆధార్‌ కార్డ్ సబ్మిట్‌ చేస్తే సరిపోతుంది. దీంతో మీ డేటా ఇతరులకు దొరకదు.  

4 /6

మాస్క్‌డ్‌ ఆధార్‌ కార్డ్‌ డౌన్‌లోడ్‌ చేసుకునే విధానం.. మొదట యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేయాలి అక్కడ డౌన్‌లోడ్‌ ఆధార్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి ఆతర్వాత మీ ఈఐడీ (EID)నంబర్‌ ఎంటర్‌ చేయాలి. ఆ తర్వాత క్యాప్చా కూడా ఫిల్‌ చేయాలి.

5 /6

అప్పుడు 'మాస్క్‌డ్‌ ఆధార్‌ కార్డ్‌ పీడీఎఫ్‌ ఫార్మాట్‌లో డౌన్‌లోడ్‌ అవుతుంది. ఈ ఆధార్‌ కార్డు హోటల్స్‌, ట్రైన్స్‌, ఎయిర్‌పోర్టు చెకిన్‌ లో ఆధార్‌ కార్డు ఫోటో కాపీ మాదిరి సబ్మిట్‌ చేయవచ్చు. మీ వ్యక్తిగత సమాచారం భద్రంగా ఉంటుంది.  

6 /6

మీరు డౌన్‌లోడ్‌ చేసుకున్న ఆధార్‌ కార్డును ఎలా అన్‌లాక్‌ చేయాలి? మీ మాస్క్‌డ్‌ ఆధార్‌ కార్డు పాస్వర్డ్‌ పెట్టుకోవాలి. ఈ ఆధార్‌ కార్డ్‌ అన్‌లాక్‌ చేయాలంటే మీ పేరులోని మొదటి నాలుగు లెట్టర్స్‌ అప్పర్‌ కేస్‌లో ఉండాలి. ఆ తర్వాత మీ పుట్టిన సంవత్సరం ఎంటర్‌ చేయాలి. ఒకవేళ మీరు RAKESH అయితే, పుట్టింది 1990 అనుకోండి. అప్పుడు పాస్వర్డ్‌ RAKE1990 పెట్టాలి.