8 th Pay Commission: మోదీ సర్కారు భారీ శుభవార్త... 8 వ వేతన సవరణ సంఘం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..

Modi govt on 8 th pay commission: ప్రధాని మోదీ బడ్జెట్ కు ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త చెప్పారు. 8వ వేతన సవరణ సంఘం ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

1 /7

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దేశ ప్రధాని మోదీ మరో గుడ్ న్యూస్ చెప్పారు. గత కొన్ని నెలలుగా 8వ వేతన సవరణ సంఘం ఎప్పుడు ఏర్పడుతుందని సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.  

2 /7

ఈ  నేపథ్యంలో అలాంటి వారికి మోదీ సర్కారు సంక్రాంతి తర్వాత అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకొవచ్చు. ప్రధాని మోదీ  అధ్యక్షతన కేంద్ర కేబినెట్ గురువారం సమావేశమైంది. ఈ క్రమంలో  పలు కీలక నిర్ణయాలకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.   

3 /7

దీనిలో ప్రధానంగా.. ఇస్రోలో మూడో లాంచ్‌ ప్యాడ్‌ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. దాదాపు రూ.3,985 కోట్ల వ్యయంతో మూడో లాంచ్‌ ప్యాడ్‌ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

4 /7

అంతే కాకుండా.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న 8వ వేతన సవరణ సంఘం ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.  దీనిపై ఇప్పటికే చైర్మన్ ను ఎవర్ని నియమించాలనే దానిపై అనేక  కసరత్తులు కూడా స్టార్ట్ అయిపోయాయి.  

5 /7

దీనిపై త్వరలోనే.. వేతన సంఘం చైర్మన్‌‌ను నియమించనున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. అంతే కాకుండా.. దీని సిఫారసుల్ని బడ్జెట్ లో కూడా చర్చిస్తారని తెలుస్తొంది.  

6 /7

మోదీ సర్కారు 8వ వేతన సవరణ సంఘం ఏర్పాటు ప్రకనటలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరొవైపు..  7వ వేతన సవరణం సంఘం.. 2016 లో అమల్లోకి వచ్చింది. దీని గడువు... డిసెంబర్ 2025లో ముగియనుంది.  

7 /7

అయితే.. కేంద్ర ప్రభుత్వం ప్రతి పదేళ్లకు ఒకసారి వేతన సవరణ సంఘం ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం 53 శాతానికి చేరుకుంది. ఈ క్రమంలో ప్రస్తుతం 8వ వేతన సవరణ సంఘంపై గుడ్ న్యూస్ వెలువడటంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం ఆనందంలో ఉన్నారు. ఈ వేతన సవరణ సంఘం ఇచ్చే సిఫారుల మేరకు జీత భత్యాలు పెరగటం ఆధారపడి ఉంటుంది.