Chaat Masala Recipe: చాట్ మసాలా ఒక ముఖ్యమైన మసాలా. ఇది మన ఇంట్లో ఉండే వస్తువులతో తయారు చేసుకోవచ్చు. ఈ మసాలా సహజ సిద్ధంగా కెమికల్ లేకుండా ఉండటమే కాకుండా మార్కెట్లో తెచ్చిన మసాలా కంటే ఎంతో రుచిగా ఉంటుంది. వివిధ రకాల డిషెస్ లో చాట్ మసాలా వేసుకుంటారు స్నాక్స్ లో కూడా వేసుకొని ఆస్వాదిస్తారు. మీరు కూడా బయటకొనేకంటే ఇంట్లోనే తయారు చేసుకోవడం ఎలాగో చాట్ మసాలా రెసిపీ ని తెలుసుకుందాం.
చాట్ మసాలా తయారీకి కావలసిన పదార్థాలు ధనియాలు -అరకప్పు, జీలకర్ర -అరకప్పు, నల్ల మిరియాలు -మూడు టేబుల్ స్పూన్లు ,సోంపు -రెండు టేబుల్ స్పూన్లు ,వాము రెండు టేబుల్ స్పూన్లు, పుదీనా ఆకులు -అరకప్పు, నల్ల ఉప్పు -50 గ్రాములు
ఎండుమిర్చి -పది, ఆమ్చూర్ పొడి-నాలుగు టేబుల్ స్పూన్లు, సీట్రిక్ యాసిడ్ -50 గ్రాములు, చక్కెర- మూడు టేబుల్ స్పూన్లు.
తయారు చేసుకునే విధానం చాట్ మసాలా తయారీకి ఒక ఫ్యాన్ తీసుకొని మీడియం ఫ్లేమ్ లో మంట పెట్టి ధనియాలు జీలకర్ర మిరియాలు, వాము, ఎండుమిర్చి, వేసి దోరగా వేయించాలి.
ఆ తర్వాత మంట తగ్గించి వీటిని తక్కువ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆ ప్లాన్ లోనే పుదీనా ఆకులు వేసి వేయించుకోవాలి అవి క్రిస్పీగా మారాక వాటిని మెత్తగా పొడి కొట్టుకోవాలి ఆ తర్వాత సిట్రిక్ యాసిడ్ ఉప్పు నల్ల ఉప్పు కూడా వేసి మరోసారి గ్రైండ్ చేసుకోవాలి,ఈ ప్లేట్ ఒక ప్లేట్లోకి ఈ గ్రైండ్ చేసిన మసాలాను వేసుకొని అందులో పొడి పొడి కొట్టుకున్న చక్కెర కూడా వేసి బాగా కలుపుకోవాలి.
రుచికరమైన చాట్ మసాలా రెడీ అయినట్లే వీటిని ఎయిర్ టైట్ కంటైనర్ లో నిల్వ చేసుకుంటే ఎక్కువ రోజులు ఫోటో నిల్వ ఉంటుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)