Vada with Idli: ఉదయాన్నే మిగిలిపోయిన ఇడ్లీలతో సాయంత్రం వేడి వేడి వడలు ఎలా చేసుకోవాలంటే..!

Left over idli: ఉదయాన్నే ఎంతోమంది ఇళ్లల్లో ఇడ్లీలు మిగిలిపోతూ ఉంటాయి.. మరి వాటిని ఏం చేయాలో ఒకసారి చూద్దాం.

1 /7

ఎంతోమంది ఇళ్లల్లో ఉదయాన్నే చేసిన ఇడ్లీలు మిగిలిపోవడం.. రోజు జరిగే పనే. మరి అలా మిగిలిపోయిన ఇడ్లీలతో సాయంత్రం పట కరకర నోరూరించే వడలు  ఎలా చేసుకోవాలో చూద్దాం…

2 /7

ముందుగా రెండు ఉల్లిపాయలను, కొంచెం అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకులు, కొత్తిమీర అన్నింటిని సన్నగా తరిగి పెట్టుకోండి.

3 /7

ఇప్పుడు మిగిలిపోయిన ఒక నాలుగు ఇడ్లీలను బాగా పొడిపొడిగా చేసుకొని‌‌.. అందులోనే  ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తరుగు, అల్లం తరుగు, అరకప్పు బియ్యప్పిండి వేసుకొద్దిగా

4 /7

అందులోనే కొద్దిగా.. కొత్తిమీర తరుగు, మిరియాల పొడి, జీలకర్ర, అరకప్పు ఉప్మా రవ్వ.. రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.

5 /7

ఇలా చేసి పెట్టుకున్న మిశ్రమంలో కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ.. వడపిండి లాగా కలుపుకోవాలి.

6 /7

ఆ తరువాత స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకొని..నూనె వేడెక్కాక.. పిండి ముద్దను తీసి గారెల్లా ఒత్తుకొని.. నూనెలో వేసుకొని రెండు వైపులా బాగా కాల్.

7 /7

అంటే ఎంతో క్రంచిగా ఉందే రుచికరమైన వడలు రెడీ‌.