Paneer Cutlet Recipe: పిల్లలకు రుచికరమైన, హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ పన్నీర్ కట్‌లెట్ ఎలా చేయాలంటే

Paneer Cutlet Recipe: ఆధునిక జీవన విధానంలో జంక్ ఫుడ్స్ కారణంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతున్నాయి. ముఖ్యంగా పిల్లల్లో ఈ పరిస్థితి అధికంగా ఉంటోంది. అందుకే పిల్లలకు ఎప్పుడూ పోషక విలువలు ఎక్కువగా ఉండే ఆహార పదార్ధాలు ఇవ్వాలి.

Paneer Cutlet Recipe: మరి పోషక విలువలు అధికంగా ఉండటమే కాకుండా రుచికరంగా ఉండాలంటే ఏం చేయాలనే టెన్షన్ ఉంటుంది. దీనికోసం పన్నీర్ కట్‌లెట్ బెస్ట్ ఆప్షన్. ఇది చాలా హెల్తీ ఫుడ్. ఇది ఎలా తయారు చేయాలో సులభంగా తెలుసుకుందాం
 

1 /5

పన్నీర్ కట్‌లెట్ తయారీకు ఏం కావాలి 250 గ్రాముల పన్నీర్, 2 ఉడకబెట్టిన బంగాళదుంపలు, ఒక ఉల్లిపాయ, 1 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం. రెడ్ మిర్చ్ పౌడర్, ధనియా పౌడర్, పసుపు, గరం మసాలా, ఉప్పు, శెనగ పిండి, బ్రెడ్, ఆయిల్

2 /5

ఏం చేయాలి ముందుగా పన్నీరు గుజ్జుగా చేసుకోవాలి. ఉడకబెట్టిన బంగాళ దుంప కూడా గుజ్జు చేసుకోవాలి. ఆ తరువాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం సన్నగా కోసుకోవాలి.

3 /5

పేస్ట్  ఇప్పుడు ఓ గిన్నెలో గుజ్జుగా చేసుకున్న పన్నీర్, బంగాళదుంపతో పాటు కట్ చేసిన ఉల్లి, పచ్చిమిర్చి, అల్లం వేసి అందులో కారం, ధనియా పౌడర్, కొద్దిగా పసుపు, గరం మసాలా, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి

4 /5

ఆ తరువాత ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న కట్‌లెట్స్‌గా చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు మరో గిన్నెలో సెనగ పిండి కలుపుకోవాలి. ఇందులో కట్‌‌లెట్ ముంచి బ్రెడ్‌లో చుట్టాలి

5 /5

ఇప్పుడు కడాయిలో నూనె వేడి చేసి అందులో ఒక్కొక్క కట్‌లెట్ వేసి వేయించుకోవాలి. వీటిని టొమాటో సాస్ లేదా పచ్చి చట్నీతో తీసుకుంటే టేస్టీగా హెల్తీగా ఉంటుంది.