Dark Circles: చర్మం అందంగా నిగనిగలాడాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ జీవనశైలి, ఇతర అలవాట్ల కారణంగా చర్మంపై మచ్చలు, కంటి కింద డార్క్ సర్కిల్స్ వంటివి ఏర్పడుతుంటాయి. ఇవి కచ్చితంగా మీ అందాన్ని దెబ్బతీస్తుంటాయి. ఇలాంటి సమస్యలున్నప్పుడు మార్కెట్ లో లభించే ఖరీదైన క్రీమ్స్ వాడే కంటే ఇంట్లో లభించే కొన్ని వస్తువులతో సులభంగా ఉపశమనం పొందవచ్చు. మీ చర్మాన్ని అందంగా మార్చుకోవచ్చు.
కేసరి-కుంకుమ కుంకుమ కేవలం వంటల్లోనే కాదు అందానికి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. 2-3 కుంకుమ రేకుల్ని చల్లని పాలలో కాస్సేపు నానబెట్టాలి. కాటన్ సహాయంతో కంటి చుట్టు పక్కల అప్లై చేయాలి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లెవనాయిడ్స్ కారణంగా కింటి చుట్టూ ఉండే చర్మం మృదువుగా , నిగనిగలాడుతుంది.
అల్లోవెరా అల్లోవెరాలో ఉండే ఎలోసిన్ కంటి చుట్టూ పిగ్మంటేషన్ సమస్యను తగ్గిస్తుంది. కింటి కింద డార్క్ సర్కిల్స్ తొలగించడంలో అల్లోవెరా అద్భుతంగా పనిచేస్తుంది. స్వెల్లింగ్ తగ్గుతుంది. కంటి చుట్టూ అల్లోవెరా జెల్ రాసి నెమ్మదిగా మస్సాజ్ చేసుకోవాలి. దీనివల్ల మంచి ఫలితాలుంటాయి. అవసరమైతే నిమ్మరసం, తేనె, రోజ్ వాటర్ కలిపి రాయాలి.
బాదం నూనె బాదం నూనె కేశాలకు చాలా మంచిది. అదే సమయంలో చర్మ సంరక్షణకు కూడా అద్భుతంగా పనిచేస్తకుంది. ఇందులో విటమిన్ ఇ, మెగ్నీషియం, ఫాస్పరస్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. బాదం నూనె రాయడం వల్ల కంటి చుట్టూ ఉండే మృదువైన చర్మంలో మార్పు స్పష్టంగా కన్పిస్తుంది.
కోల్డ్ గ్రీన్ టీ బ్యాగ్ వాడేసిన గ్రీన్ టీ బ్యాక్ పాడేయకుండా కంటి కింద అప్లై చేసుకోవచ్చు. ఇందులో ఉండే ఫెనోలిక్ కాంపౌండ్స్ అద్భుతంగా పనిచేస్తాయి. మీరు చేయాల్సిందల్లా వాడేసిన గ్రీన్ టీ బ్యాగ్ రాత్రంగా ఫ్రిజ్లో ఉంచి ఉదయం కంటి కింద పెట్టుకోవాలి. దీనివల్ల కంటి చుట్టూ నరాల్లో రక్త సరఫరా మెరుగుపడుతుంది. నల్లటి మచ్చలు తొలగిపోతాయి.
బంగాళదుంప ఆరోగ్యంతో పాటు అందాన్ని ఇచ్చే మరో అద్భుతమైన పదార్ధం బంగాళదుంప. బంగాళదుంపలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి అవసరమైన న్యూట్రిషన్లను అందిస్తుంది