IIT BABA Salary: మహాకుంభంలో స్పెషల్ అట్రాక్షన్ ఐఐటీ బాబా..ఆయన జీతం ఎంతో తెలిస్తే షాక్ అవ్వడం పక్కా ?

IIT BABA Salary: మహా కుంభమేళాకు హాజరైన నాగసాధువులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఆహార్యం, పద్ధతులతో అందర్నీ ఆకట్టుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఐఐటీ బాబా వైరల్ అవుతున్నారు. 

1 /6

Mahakumbh Mela 2025: భూ మండలంపైనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంబురం మహాకుంభమేళాకు కోట్లాది మంది భక్తులు తరలిస్తున్నారు. సాదువులు, నాగసాధువులు, సాధారణ భక్తులతో ప్రయాగ్ రాజ్ ప్రాంతంలో ఇసుక వేస్తే రాలనంత భక్తులు తరలివెళ్తున్నారు. 

2 /6

13 అఖాడాలకు చెందిన నాగసాధువులు మహాకుంభమేళాకే ప్రత్యేక ఆకర్షణగా ఉంటున్నారు. అత్యంత నిష్ట, నియమాలతో నిత్యం దైవస్మరణలో ఉండే సాదువులను చూస్తే నిరక్షరాస్యులేమో అనిపించక తప్పదు. కానీ ఈ అఖాడాలకు చెందిన సాధవులో అత్యాధికులు విద్యాధికులే ఉన్నారు.

3 /6

ఇంజనీరింగ్, వైద్య, విద్య, మాస్టర్స్ చేసినవారు ఉన్నారు. పెద్ద పెద్ద సంస్థల్లో లక్షల జీతాలు తీసుకుంటూ వాటన్నింటినీ త్యజించి నాగసాధువులుగా మారిన సన్యాసులు ఎంతో మంది ఉన్నారు. వీరిలో ఐఐటీ బాబాగా ఖ్యాతి పొందిన అభేయ్ సింగ్ కూడా ఒకరు.   

4 /6

అభయ్ సింగ్  తాను కూడా కెనడాలో మూడేళ్లుగా నివాసముంటున్నానని, అక్కడ లక్షల రూపాయలతో పని చేసేవాడినని చెప్పాడు. తాను 2019లో కెనడా వెళ్లానని, అక్కడ కెనడియన్ కంపెనీలో నెలకు రూ. 3 లక్షలు అంటే రూ. 36 లక్షల ప్యాకేజీపై పనిచేశానని అభయ్ చెప్పాడు. దీని తరువాత అతను  ఉద్యోగం, జీవితంపై నిరాశలో ఉన్నాడు. దీంతో అతను ఆధ్యాత్మికత వైపు వెళ్లినప్పుడు బాగానే అనిపించింది.

5 /6

కెనడాలో ప్రతి నెలా రూ.3 లక్షలు సంపాదిస్తున్నానని, అయితే అక్కడ జీతం ప్రకారం ఖర్చులు ఉన్నాయని అభయ్ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇక్కడ యాపిల్‌ను రూ.50కి విక్రయిస్తే, అక్కడ రూ.200కి విక్రయిస్తున్నారు. అతను కెనడాలో డిప్రెషన్‌తో పోరాడుతున్నానని చెప్పాడు. దీని తరువాత అతను మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాడు. ఆధ్యాత్మికత వైపు మళ్లాడు.   

6 /6

నిజానికి ఐఐటీలో చదువుకునే రోజుల్లోనే ఫిలాసఫీ వైపు ఆకర్షితుడైనట్లు చెప్పాడు. చాలా ఫిలాసఫీ కోర్సులు చదవడంతోపాటు సోక్రటీస్, ప్లేటోలను పూర్తిగా చదివాడు. శివుడిని అమితంగా ఆరాధించే అభయ్ సింగ్ తన జీవితంలో ఇదే అత్యుత్తమ దశగా అభివర్ణించుకున్నారు. సైన్స్ ద్వారా ఆధ్యాత్మికతను అర్థం చేసుకుంటున్నట్లు తెలిపారు.