India Vs West Indies Updates: తొలి టెస్టులో టీమిండియా బ్యాట్స్‌మెన్ బద్దలు కొట్టిన రికార్డులు ఇవే..!

Ind VS WI 1st Test Records: వెస్టిండీస్‌తో జరుగుతున్న మొదటి టెస్టులో టీమిండియా పట్టుబిగించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ సెంచరీలతో కదం తొక్కడంతో భారీ ఆధిక్యం దిశంగా భారత్ పయనిస్తోంది. ఈ క్రమంలో పలు రికార్డులు బద్దలు అయ్యాయి. వాటిపై ఓ లుక్కేయండి..
 

1 /6

ఆసియా వెలుపల టెస్టు అరంగేట్రంలో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు 143 పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా యశస్వి జైస్వాల్ నిలిచాడు. 1996లో లార్డ్స్‌లో ఇంగ్లండ్‌పై 131 పరుగులు చేసిన సౌరవ్ గంగూలీ రికార్డును బ్రేక్ చేశాడు. అదేవిధంగా తొలి మ్యాచ్‌లోనే అత్యధిక డెలివరీలు (350) ఎదుర్కొన్న భారత భ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. 1984లో కోల్‌కతాలో ఇంగ్లండ్‌పై 322 బంతులు ఎదుర్కొన్న మహ్మద్ అజారుద్దీన్‌ను రికార్డును బ్రేక్ చేశాడు.  

2 /6

అరంగేట్రం టెస్టులోనే సెంచరీ బాదిన 17వ భారత బ్యాటర్‌గా టీమిండియా ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ నిలిచాడు. శిఖర్ ధావన్, పృథ్వీ షా తర్వాత అరంగేట్రం టెస్టుల్లో సెంచరీ చేసిన మూడో ఓపెనర్ జైస్వాల్. 

3 /6

అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న ఆటగాళ్లలో అత్యధిక సెంచరీలు (44) బాదిన బ్యాట్స్‌మెన్‌ జాబితాలో కెప్టెన్ రోహిత్ శర్మ నాలుగోస్థానానికి చేరుకున్నాడు. స్టీవెన్ స్మిత్‌తో సమానంగా నిలిచాడు. విరాట్‌ కోహ్లి, జో రూట్‌, డేవిడ్‌ వార్నర్‌ తొలి మూడుస్థానాల్లో ఉన్నారు.   

4 /6

టెస్టు క్రికెట్‌లో వికెట్ నష్టపోకుండా టీమిండియా తొలిసారిగా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. వెస్టిండీస్‌ను 150 పరుగులకు ఆలౌట్ చేసిన భారత్.. ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ తొలి వికెట్‌కు 229 పరుగులు జోడించారు.   

5 /6

టీమిండియా తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఐదో బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీ (8,515) నిలిచాడు. సెహ్వాగ్ 8503 పరుగులను అధిగమించాడు. టెండూల్కర్ (15921), రాహుల్ ద్రవిడ్ (13265), సునీల్ గవాస్కర్ (10122), వీవీఎస్ లక్ష్మణ్ (8781) తొలి నాలుగు స్థానాల్లో ఉన్నారు.    

6 /6

టెస్టుల్లో వెస్టిండీస్‌పై యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ భారత్ తరఫున అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 2002లో ముంబైలో వీరేంద్ర సెహ్వాగ్-సంజయ్ బంగర్‌ల 201 రికార్డును బ్రేక్ చేశారు.